వద్దు వద్దు

కథ

సత్య నవ్య ఇద్దరూ అంగడికి వెళ్లారు.

రాపోలు శ్రీదేవి

పిన్ని ! ఇక్కడ ఆకుకూరలు తాజాగా ఉన్నాయి తీసుకుందామా? అని అడిగింది నవ్య..
సత్య ‘వద్దు వద్దు’ చూసావా ?వాడు నీళ్లు చల్లుతున్నాడు ..
ఆ నీళ్లలో ఏం కలిపాడో ఏమో ?

ఇక్కడ పండ్లు ఉన్నాయి తీసుకుందామా ?పిన్ని
దానిమ్మ చూడు ఎర్రగా ఉంది? తీసుకుందామా?
‘ వద్దు వద్దు’వాటికి ఇంజక్షన్స్ వేస్తున్నారు.
పోనీ పుచ్చకాయ వద్దు దానికి కూడా ఇంజక్షన్ ఇస్తారు.

కొద్ది దూరం వచ్చాక మామిడి పండ్లు కనపడ్డాయి.
ఇవన్నా తీసుకుందామా? పిన్ని చూడరా! దీనిమీద తెల్లగా పౌడర్ కనిపిస్తుంది. పండడానికి ఏమీ వేశారో ఏమో?
‘ వద్దు వద్దు’

అక్కడ పచ్చి బఠానీలు ఉన్నాయి తీసుకుందామా ?పిన్ని
వద్దే తల్లి అవి చూడు గ్రీన్ కలర్ వేసినట్టు లేవు .

మల్లెపూలు తీసుకుందామా? పిన్ని పదా తీసుకుందాము..
అని పూల వైపు నడిచారు..
ఇదేం సోధ్యమే? తల్లి పూలకు కూడా రంగులా?!
అవి పసి మొగ్గల్లా కనిపించడానికి గ్రీన్ కలర్ వేస్తున్నారు.
అయ్యబాబోయ్

పిన్ని ఇంకేం తీసుకుందాం ?అన్నిటికి అన్ని చెప్తే కూరగాయలు అన్నా తీసుకుందాం పదా.. సరే పదా!
ఈ టమాటాలు చూడు!
పది రూపాయలకు కేజీ గాని..
అస్సలు ఉడకడం లేదు అయినా తీసుకోక తప్పదు. తీసుకో.. నువ్వు ఒక కేజీ నాకుఓ కేజీ

ఇక్కడ ఆకుకూరలు చూద్దామా !పిన్ని
పదా .. పూదిన ఉందా? అని అడిగింది సత్య ..
కొంచెం వాడినట్టుంది అమ్మ
పర్లేదు బాబు ఇచ్చేయ్ నీవు తీసుకో నవ్య ..
ఇంకా అటు ఇటు తిరిగి ఏవో కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటి దారి పట్టారు .

అక్కడ గప్ చుప్ లు ఉన్నవి తిందామా? పిన్ని ..
“వామ్మో వద్దే “
నాకు ఆ నీళ్లు ఏమి నీళ్లు ఏమిటో? వద్దు బాబోయ్..
వాట్సాప్ మెసేజ్ ల్లో చూడడం లేదు..
నాకు వద్దు నీకు కూడా వద్దు పదా..

పోనీ బజ్జీలు అన్నా తిందాం పిన్ని..
ఆ నూనె ఎన్ని రోజులైనా మార్చారు బాగుండదు ..
ఇంట్లో నేనే చేస్తా.. పదపదా…
అంటూ తరుముతున్నట్టే తీసుకొచ్చింది సత్య

పిన్ని నీవు వాట్సాప్ మెసేజ్ లు చూడడం మానేసేయ్ లేకుంటే ఏమీ తినలేవు కొనలేవు అంది నవ్య.

అది నిజమే కానీ
ఆ మెసేజ్ లలో కూడా వాస్తవం లేక పోలేదు కదా!
చూస్తూ చూస్తూ ఎలా కొనగలం ఎలా తినగలం

హోలీ రంగులో హని కరం అనుకుంటూ ఉంటే..
తినే పండ్లు..కూరగాయలు రంగుల మయం అయితే ఎలా తింటాం!?!

మన తప్పు కూడా ఉంది..దానిమ్మ..పుచ్చకాయ లాంటి పండ్లు
లోపల ఎర్ర గా ఉండాలని చూస్తాం కదా!

అమ్ముడు పోవడానికి వారు ఎంచుకున్న మార్గం అది..
మనం మారితేనే..అన్ని మారుతాయి..
ప్రయత్నించండి

 

……రాపోలు శ్రీదే

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీలికళ్ళు

సులోచనాలోచనలు