మండోదరి

కవిత

కైలాస సందర్శన   ఆనందంలో

పద్మశ్రీ చెన్నోజ్వల

అప్సరకాంత

శివతేజానికి సడలిన విచక్షణ

పార్వతీదేవి క్రోధాగ్నికి సమిధైన ‘శపిత మధురం ‘

భూలోకాన పుష్కరకాల మండూక జీవనం

హేమామయుల తఫఃఫలం

వారింట నడయాడిన అపరంజి సోయగం

చదరంగ క్రీడకు శ్రీకారం చుట్టిన తంత్రవేత్త

రక్కసరాయుని పాణిగ్రహణం చేసిన రతనాలరాశి

చెవిటి వాని ముందు శంఖనాదం అయ్యింది

దశకంఠుని  మ్రోగిన ధర్మ గంట

ఖలుని ఇంట కరిగిన కర్పూర హారతి

ఆమె మహిళ మండోదరి

మరుపు పొరలలో

మెరుపు తీగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నమస్కారం చక్కటి సంస్కారం

మన మహిళా మణులు