శాంతిమంత్రం

శ్రీరేఖ బాకరాజు

సర్వే  భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
 
ఇది ప్రముఖమైన శాంతి మంత్రము. వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడినది.  అందరికీ శాంతి సౌభ్రాతృత్వాలుండాలనే ఆశయంతో ఈ మంత్రము చదువబడుతుంది.  భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం. ఈ మతం ఆ మతమని లేకుండా విశ్వ జనులందరికీ శాంతి  చేకూరాలని  ఆకాంక్ష  గలిగిన గొప్ప సంస్కృతీ భారతదేశానిది. మునులు ఋషులచే విరచితమై శాంతి మంత్రాలు గొప్ప ఆదరణ పొందినవి. యజ్ఞ యాగాదులలో పూజలలో ఈ మంత్రాలను చదువుతారు.
 
పై మంత్రం భావార్ధం ‘సర్వే ‘అంటే అందరికీ, ‘భవంతు సుఖినః ‘సుఖంగా ఉండాలని కోరుతున్నాము. ‘సర్వే సంతు నిరామయా ‘అంటే అందరూ నిరోగులవ్వాలని,  
సర్వే భద్రాణి పశ్యన్తు‘అంటే అందరూ మంచి చూడవలెనని
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్ ‘అంటే ఎవరికీ ఏ విధమైన బాధలు కష్టాలు ఉండకూడదని ఆశయం. ఇది ఏ ఒక్క సమూహానికి సంబంధించినది కాదు. ఇది అందరి గురించి ఆశించినది. పై మంత్రం శాంతి మంత్రాలలో ఒకటి. అందరికీ శాంతి చేకూరాలని ముమ్మారులు జపించబడినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః అంటే అన్ని  లోకాలలోను శాంతి కలగాలని కోరుతున్నారు.
మనుష్యులకు కాకుండా జంతువులకు పశు పక్ష్యాదులు కూడా ఇది వర్తిస్తుంది. సర్వత్రా అందరికీ మంచి జరగాలనే భావన ఈ మంత్రం వలన తెలుస్తున్నది.
 
ప్రాచీన కాలంలో సంస్కృతం వాడుకలో ఉండేది. కాబట్టి చాలా వేద మంత్రాలు సంస్కృతంలో రచింపబడినవి. ఈనాటి కాలంలో సంస్కృత భాష వాడుకలో లేదు కాబట్టి చాలా మందికి మంత్రాల అర్థ తాత్పర్యాలు తెలియకపోవడంతో వాటి ప్రభావం కానీ, విలువ కానీ తెలుసుకోలేకపోతున్నారు. మంత్రాల భావార్థాలు తెలుస్తే వాటిని తప్పక ఆచరిస్తారు. వాటిని పూజలలో హృదయపూర్వకంగా చదువుతారు. మంత్రం అంటే మననాటి  త్రాయతే ఇతి మంతః అంటే  మంత్రాలను మననము చేస్తూ చదివితే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రం అంటే మరొక అర్థం మనసునకు లభించే ఒక గొప్ప శక్తి. మంత్రాలను ఉచ్చ్చరించడం  వలన జీవితానికి గొప్ప పరమార్థముూ సత్యమైన మహత్తు లభిస్తుంది. అన్ని మంత్రాలలో  శాంతి మంత్రం ఇంకా గొప్పది. ఎందుకంటే శాంతి మంత్రాలు విశ్వ శాంతిని కోరతాయి. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా  ఎక్కడైనా చదువవచ్చు,. ధ్యానం  లో కూడా. మంత్రాలు సాధారణంగా గురువుల నుండి నేర్పబడతాయి. ఉచ్చ్చారణ దోషాలు లేకుండా చదవడం చాలా ముఖ్యం.  అర్థాలను తెలుసుకొని మంత్రాలను మననం చేస్తే వాటి ప్రభావం, లాభం మనసుపై సరియైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మంత్రం భావార్థాన్ని ఆశయాన్ని తెలుసుకొని దీనిని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని ఆశిద్దాం.

అయితే ఈ మంత్రం పూర్వకాలంలో యజ్ఞ యాగాలలో నే కాదు ఈ ఆధునిక కాలంలో నూ చాలా మంది చాలా చోట్ల చదువుతున్నారు. దీనికి ప్రధాన కారణం సామాజికం గా ఆలోచించి అందరూ బాగుండాలి అనేదే ఈనాటి యజ్ఞం. కాబట్టి మనమూ ప్రతి రోజూ చదువుకుందాం!

Written by SriRekha Bakaraju

శ్రీరేఖ బాకరాజు
నా స్వీయ రచన: రాగ మాధుర్యం
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్ తెలంగాణ
ప్రస్తుతం : టొరంటో కెనడా
చదువు: ఆంధ్ర మహిళా సభ, రెడ్డి ఉమెన్స్ కాలేజీ ఇంటర్ బి స్సీ, గోల్డ్ మెడలిస్ట్ ఎం స్సీ మాథెమాటిక్స్ మరియు ఎం.ఫీల్ మ్యాథమెటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ
 
వృత్తి : సాఫ్ట్వేర్ ఇంజనీర్
ప్రస్తుతం : ఇన్వెంటరీ కంట్రోల్
కళలు : కర్ణాటక సంగీతం , హిందూస్థానీ సంగీతం మరియు సితార్ లో ప్రావీణ్యం  
తెలుగు భాష అంటే ఇష్టం.
కథలు కవితలు పాటలు రాయాలంటే
సరదా. నా రచనలకు బహుమతులు కూడా వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ముళ్ళ పొదలో గులాబి

తీర్చుకోలేని రుణం