జాగ్రత్త జాగ్రత్త

రాపోలు శ్రీదేవి

పావని !పావని! సన్నీ చూడు రోడ్డు మీద నుండి పరిగెడుతున్నాడు
ఏమైనా వెహికల్స్ వస్తే? ఎట్లా ?అనగానే..పావని వాళ్ళ బాబుని కసిరి ఇంట్లోకి పిలిచింది .
ఆంటీ !ఆడుకోకుండా చేశారు అని సన్నీ అనగానే..
నిన్ను ఆడుకోవద్దు అనలేదు నాన్న.. కాకపోతే రోడ్డుమీద చూసుకోకుంటే యాక్సిడెంట్ అవుతుందని భయం.

ఓసారి శ్రీజ అక్క ఇలాగే మేము ఊరికి వెళ్లడానికి నిలబడ్డాం స్కూల్ ముందర నిలబడ్డాం.
కానీ బస్సు దొరకలేదు ఎవరైనా డ్రాప్ చేస్తారా అని అడుగుదామనుకుంటుండగానే…
శ్రీజక్క పరుగున రోడ్డు క్రాస్ చేసింది .
ఇంతలో పెద్ద నల్లని టాటా సుమో వేగంగా వచ్చి సడన్గా బ్రేక్ వేసింది .
లేకపోతే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో…తెలుసా.. అసలు ఆ స్పీడులో బ్రేక్ వేసేసరికి టైరు అరిగిపోయింది.
అంత ఫాస్ట్ గా వచ్చింది అందుకే రోడ్డుమీద ఆడొద్దని పిలిచాము. ఇప్పుడైతే శ్రీజ అక్కనే నన్ను రోడ్డు దాటిస్తుంది

స్వప్న చూడు మన హీరో గారు ఏం చేస్తున్నారు ?
ఐదో ఫ్లోర్ నుంచి బానే మెట్లు దిగి వస్తాడు ఎక్కి వెళ్తాడు కానీ చూడు ఒక మెట్టు వదిలి ఒక మెట్టు మీద కాలు పెడుతూ ఎక్కుతున్నాడు ఏమన్నా అయితే?
ఓసారి మా చిన్న పాప మా ఆడపడుచు కొడుకు వెనకాల మెట్లు ఎక్కుతూ ఆయనలాగే మెట్టు వదిలిపెట్టు మెట్టు ఎక్కబోయి పడితే కన్ను దగ్గర పెద్ద గాయం అయింది.
కన్నులాగా తెర్చుకుంది బడబడా రక్తం కారింది ఆరోజు పెద్ద వర్షం హడావుడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కుట్లు వేస్తూ ఉంటే నాకైతే ఆ అమ్మాయి ఏడుపుకి కాళ్ళ కింద భూమి కల్పించినట్లు అయింది.

సాయంత్రం బండిమీద బయటకు వెళ్తుంటే కొంతమంది పిల్లలు కరెంటు స్తంభానికి శ్రీరామ కళ్యాణం బ్యానర్ కడుతున్నారు బండి ఆపించి పిల్లలూ !కరెంటు స్తంభానికి కట్టవాకండి షాక్ కొడుతుంది.
వేరే దగ్గర కట్టండి అని చెప్తుంటే …నీకెందుకే? అని మా శ్రీవారు వారించారు..
మీకు గుర్తుందా!?!!
మనసిరి చిన్నప్పుడు కరెంటు వైర్ పొరపాటున పట్టుకొని ఏడుస్తుంటే ఏంటా? అని నేను పట్టుకున్న ఇద్దరికీ కలిపి సిరి విసిరి కొడితే అల్లంత దూరాన పడ్డాం .
ఆ షాక్ తగిలిన రెండు రోజులు షాక్ లోనే ఉన్నా ము. ఇంటికి వస్తూ లిఫ్ట్ ఎక్కబోతే పిల్లలు లిఫ్ట్ లో ఆడుతున్నారు.

మాధవికి ఫోన్ చేసి పిల్లలు లిఫ్ట్ లో ఆడుతున్నారు కరెంటు పోతే కష్టం అని చెప్పాను.

నీకెందుకే అని మా శ్రీవారు అనగానే మొన్ననే కదా మనం ఊరు వెళ్లినప్పుడు లిఫ్ట్ ఆగిపోతే మీరు అందులో 10 నిమిషాలు ఉండి చెమటలతో తడిసిపోయి వచ్చారు ఎంత భయం వేసింది.
అసలే చిన్న పిల్లలు అని చెప్పాను.

మరోసారి పిల్లలు దాచుకొని ఆట ఆడుతున్నారు.
జాగ్రత్త రా బాబు !అని అనుకుంటూ వచ్చాను.

మేము తిరుపతి వెళ్ళినప్పుడు హోటల్లో మా తమ్ముడు మా చుట్టాలబ్బాయిని దాక్కొని బెదిరిద్దామని అనుకుంటే వాడు ఫాస్ట్ గా వచ్చేసరికి వీడి పన్ను లు వాని గుండులో ఇరుక్కున్నాయి ఎంత భయం వేసింది ఆ పండ్లు తెచ్చి నా చేతిలో పెడితే చేప పిల్లల లాగా కదిలాయి.
తర్వాత రెండు దోసెలతోటి రక్తం కారుతుంటే పట్టి సింకులో పోశాను.
ఇప్పటికీ వాడి పనులు సెట్ గాక ఎంత ఇబ్బంది పడుతున్నాడో…
నాకు అప్పుడప్పుడు కలలో కూడా
ఆ దృశ్యం కనిపించి ఒళ్ళాంతా కంపించి లేచి కూర్చుంటాను.

సారిక !
లక్కీ టోర్నమెంట్స్ కి వెళ్తుంది అట కదా ఎక్కడ ఉంది?
లక్కీ ! టోర్నమెంట్ వెళ్లే దగ్గర జాగ్రత్తగా ఉండు.
అమ్మ నాన్న లేకుండా ఫస్ట్ టైం వెళ్తున్నావ్ ఎవరేమన్నా భయపడకు ధైర్యంగా ఉండు .
ఎవరైనా మిస్ బిహేవ్ చేసినట్టు అనిపిస్తే సార్ కి చెప్పు..
ఏమీ ఆలోచించక ఆట మీద దృష్టి పెట్టి ఆడు కప్పుగెలుచుకొని రావాలి సరేనా..

స్వాతి అన్షూ చూడు
చూసుకోకుండా పరిగెడుతుంది దెబ్బ తగిలితే ..ఎలా?
ఇందాక కాస్త లో అక్కడ ఉన్న రాళ్ల మీద పడబోయింది
అసలే అమ్మాయి..
మా చెల్లి కూతురు ఆడుతూ కింద పడి చెయ్యి విరిగింది .

పిల్లలు నీళ్ల దగ్గర ఆడిన భయమే ఈదరాక ఎక్కడ ఇబ్బంది పడతారో ?…
అని
మా ఇంటి వారసుడు ఐదుగురు అమ్మాయిల తోడ ఒక్కడే ఒక్కడు వారసుడు అని మురిసిన మా శివ
మా మరిది కొడుకు స్నేహితులతో హోలీ పండుగ రోజున పానగల్లు చెరువుకు పోయి ఈతరాక ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఇప్పటికీ వాడిని మరువలేక మేము పడే వేదన అంతా ఇంతా కాదు .
అందుకే పిల్లలు ఆడుకుంటున్నా ఎందుకో భయం వేస్తూ ఉంటుంది నాకు తెలియకుండానే జాగ్రత్తలు చెప్తూ ఉంటాను .
ఈమె చాదస్తం అనుకుంటారో ఏమో అందరూ కానీ…
మా చిన్నమ్మాయి పెద్దగా అయ్యేలోపు నాకు రోజు ఒక సినిమా చూపించేది ఏదో ఒక గాయం చేసుకొని వచ్చేది ఒంటినిండా గాయాల తాలూకు మచ్చలే అందమైన ఆ రూపానికి దిష్టి చుక్కలా ఎన్ని మచ్చలు…
ఓసారి కరెంట్ షాక్ కొట్టింది
ఓసారి బండి సైలెన్సర్ కాలింది .
మరోసారి వాటర్ ట్యాంక్ లో పడబోయింది .
ఒకటి రెండా.. ఎన్నో గండాలు తప్పించుకొని ఇలా పెద్దది అయింది.
అయినా ఇంకా నాకు భయం పోలేదు.

మా ఎదురింటి అబ్బాయి..కన్నయ్య
పేరు కు తగ్గట్టే రోజు ఎదో ఒక కొంటె పని చేస్తుంటాడు .
అర్చన కు వాడు ఆడి పడేసిన ఆటవస్తువులు సర్దటం తోటే సరిపోతుంది.
వాణ్ణి చూసుకోవడం కోసం జాబ్ కూడా మానేసింది.

పిల్లలు అంటే చాలా ఇష్టం . అందుకే “జాగ్రత్త జాగ్రత్త” అని అంటూ ఉంటాను..
వాళ్లు బాగానే ఆడుకుంటారు.
కానీ… ఆటల్లో పడి ఏదీ చూసుకోరు మనం జాగ్రత్త చెప్పాలి .

అంతే కానీ ఏదో అవుతుందని భయపడి బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచితే శారీరకమైన వ్యాయామం ఉండదు.

ఆటలే పిల్లలకు మంచి వ్యాయామం అందుకే తల్లులు పిల్లలకు ఆడుకోమని పంపుతూ
జాగ్రత్త లు చెప్పి పంపాలి…

 

…..రాపోలు శ్రీదేవి

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిన్నను మరచిన నేడు

కనిపించని సంకెళ్లు