పూలవ్యాపారంలో చెన్నమ్మ దంపతులు

మూసాపేట దగ్గర ఉన్న భరత్ నగర్ మెట్రో916 మార్కెట్లో తెల్లారి ఐదున్నర కల్లా కళకళలాడుతూ పూలతో పాటు నవ్వుతూ కనిపించే సంగనివోని చెన్నమ్మ అర్ధాంగి గా మంచి అమ్మగా ఆదర్శం గా నిలుస్తుంది.భర్త నారాయణ ఆమె కి తోడు నీడ అన్నింటా ఆమె కి సరిజోడు.చెన్నమ్మ వనపర్తి లో పుట్టింది.అమ్మనాన్న కూలీని చేసేవారు.ఈమె పెద్ద కూతురు.బడి మొహం ఎరుగదు.12వ ఏటనే పెళ్లి ముగ్గురు పిల్లలు తోడికోడలు బావ వారి పిల్లలతో ఉమ్మడి కుటుంబం లో బరువు బాధ్యతలు మోస్తోంది.నీట్ గా నవ్వుతూ మంచిగా మాట్లాడుతూ పూలకోసం వచ్చేవారికి ఆధారంగా పూలు అందిస్తుంది.కొడుకు డిగ్రీ ఇద్దరు కూతుళ్లు ఇంటర్ ఫస్టియర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు.

తమకి అక్షరం ముక్క రాకున్నా పిల్లల దగ్గర ఆంగ్లంలో ఫోన్ నెంబర్ చెప్పటం నేర్చుకున్నారు భార్యాభర్తలు.మెట్రో వారి కి నెల కి 2500అద్దె చెల్లి‌ంచాలి.”మా ఆయన రోజు మూడు న్నారు కి లేచి గుడిమల్కాపూర్ టూవీలర్ పై వెళ్లి పూలు తెస్తాడు.ఆయన ఇంటికి వచ్చి నాకు నేను 6కల్లా దీనదయాళ్ నగర్ నుంచి వచ్చి షాపులో కూర్చుంటాను.నాభర్త నాకు టిఫిన్ తెచ్చి పెడితే ఇక్కడే తింటాను.మధ్యాన్నం ఇంటికి వెళ్ళి అన్నంతిని నాలుగు కి వస్తాం ఇద్దరం.ఆయన చకచకా పూలదండలు అన్ని సైజుల్లో కడతాడు.నాకు కట్టనీకి రాదు.22ఏళ్లనించి ఈపూలవ్యాపారంలో ఉన్న.బంతి చేమంతి రంగుల గులాబీ లు జాజి మల్లె గడ్డి చేమంతి దండలో కట్టే ఆకులు నెలకి 10_15వేలు పెట్టి కొంటాం.చేమంతిపూలకి గిరాకీ ఎక్కువ.పండగలప్పుడు పూరీకి గిరాకీ బాగా ఉంటుంది.పూలదండలు సైజులని బట్టి 50_200రూపాయలు వారికి అమ్ముతాను.గోనెసంచీలో పూలు ఉంచి పైన నీరు చల్లుతాను.చిన్న ఫ్రిజ్ లో కొన్ని పూలు పెడతాను.నాపిల్లలు ఇంటిపని వంటపని చేస్తూ చదువు లో చురుకుగా ఉన్నారు.వారు బాగా చదువుకుని గొప్ప వారు కావాలి అని మాఆశ” అంటున్న చెన్నమ్మ లో భవిష్యత్తు తళుక్కున మెరిసింది.ఆదంపతుల అన్యోన్యత ఒద్దిక నన్ను ఎంతో ఆకర్షించింది

నారాయణ ఫోన్ నెంబర్ 9701814080

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఈవారం లలిత సంగీతం పాట