ప్రముఖ రచయిత్రి బండ సరోజన గారిని తెలుగు విశ్వవిద్యాలయం వారు సత్కరించిన ఫోటోలు ఇవి. బండ సరోజిని గారు తెలుగు విద్యార్థుల కోసం ఎస్సీఆర్టీ పాఠ్యాంశపు గ్రంథాలను ఎన్నో రచించారు. కథలు రాశారు వ్యాసాలు, రాశారు,వారి జీవిత చరిత్ర ను రచించారు, అవి పుస్తకాలుగా ప్రచురించారు. అధ్యాపకురాలిగా ఒక రచయిత్రిగా బండ సరోజిని గారి స్థానం ఉన్నతమైన స్థానం. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న బండ సరోజన గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. బందరు సరోజన గారి కుమార్తె అపర్ణ అమెరికాలో పెద్ద ఉద్యోగంలో వారి దగ్గరే బండ సరోజిని గారు ప్రస్తుతం ఉన్నారు.అమెరికాలో’ మనబడి ‘అని చాలా ప్రముఖమైనటువంటి విద్యాసంస్థ ఉన్నది. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి తెలుగు నేర్పిస్తూ పాఠ్య గ్రంథాలను వాళ్లే సిద్ధం చేసుకుని మన పాఠశాలలో ఏ విధంగా నడుస్తాయో ఆ విధంగా కేవలం తెలుగు భాష మీదనే శ్రద్ధ వహించి వివిధ రకాల పాఠ్యప్రణాళికలతో పిల్లలకు నేర్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తూ సర్టిఫికెట్స్ ని అందజేస్తూ ఉంటారు.
అటువంటి మనబడి వారు మొన్న 2023 ఏప్రిల్ 22 నాడు వారి స్నాతకోత్సవానికి బండ సరోజన గారిని ముఖ్యఅతిథిగా పిలిచారు. బండ సరోజన గారి ఉపన్యాసం తర్వాత వారిని ఘనంగా సత్కరించారు. అభ్యుదయభావాలతో బండ సరోజన గారు వారి జీవితకాలమంతా తెలుగు భాషకు,,సాహిత్యానికి వారి సమయాన్ని వెచ్చించారు. అధ్యాపకురాలిగా ఎందరికో విద్యాదానం చేశారు. బండ సరోజిని గారు నేటి కవయిత్రులకు, రచయితలకు ఆదర్శ పాత్రులు. బండ సరోజన గారికి తరుణి శుభాకాంక్షలు అందజేస్తున్నది.
డా. కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు