విద్య నిగూఢ గుప్తమగు విత్తము,
రూపము పురుషాలళికిన్,
విద్య యశస్సు, భోగ కరి
విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము,
విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృ పాల పూజితము,
విద్య నె రంగనివాడు మత్యు డే.
భావము :– మనిషి లోపల మస్తిష్కంలో రహస్యంగా దాచబడిన ధనంవిద్య. బాహ్య వస్తువు దొంగిలించడానికి అవకాశం ఉంది. కానీ మదిలో దాచిన దానిని ఎవ్వరూ కొల్లగట్టలేరు.
విద్య నీలో ప్రేరణ కలిగించి కీర్తిని దాని ద్వారా భోగాలను సమకూరుస్తుంది. విద్య గురువు వలె నీ వెంట నుండి సన్మార్గంలో నడిపిస్తుంది. విదేశాలతో మనకి దగ్గరితనం చేస్తుంది తన ప్రతిభతో.
విద్య మనని అన్నివేళలా కాపాడుతుంది. విద్యలో నిష్టాతుడైనవాడు ఎల్లచోట్ల సన్మానితు దగుటయే కాక భాగ్యాన్ని కూడా వెంట తెచ్చుకుంటాడు.
మనని రాజ్య నీతిజ్ఞునిగా , రాజ్యబోజ్యునిగా కూడా నిలబెడుతుందివిద్య. విద్య లేనివానిని వింత పశువు అనేవారు పెద్దలు. మనిషి కాడని అర్థము. నిరీక్షరాస్యుని కృషి అనావృష్టితో సమానము.