నవ్వు

          వాసరచెట్ల జయంతి

ఈ నేల పైన అన్ని జీవరాశులలో మనిషి గొప్ప స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మానవ మేధస్సు ఒక కారణం అయితే, భావ వ్యక్తీకరణ ఒకటి .

నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు. నవ్వు ఒక ఔషధం వంటిది. మానిసిక వేదనలు పోగొట్టే అద్భుతం.

ఈ చిన్ని జీవితంలో కష్టసుఖాలు కలగలిసిన ఎన్నో అనుభవాలు ఉంటాయి.
కష్టం వచ్చినప్పుడు బాధతో కన్నీళ్లు ఎలా సహజమో నలుగురూ కలిసిన ఆనందకరమైన హాస్య సన్నివేశాలు ఉన్నప్పుడు నవ్వు కూడా అంతే సహజం. విచిత్రం ఏమిటంటే బాగా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు సహజంగానే వస్తాయి.
కానీ నవ్వినపుడు వచ్చే కన్నీళ్లు మన ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తే ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్లు ఆరోగ్యం పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. నవ్వుతున్నప్పుడు ముఖంలోని కండరాలు సంకోచ వ్యాకోచాలు జరిగి ముఖం కాంతివంతంగా అవుతుంది. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మానవ జీవితకాలం కూడా పెరుగుతుందని డాక్టర్ లు అంటారు.
నవ్వడానికి భాషతో ,ప్రాంతంతో సంబంధం లేదు.
ఇది మానవులకు మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు.
మనం సంతోషంగా ఉన్నామని చెప్పడానికి నవ్వు ఒక సంకేతం.
కోపంగా ఉన్న వ్యక్తిని మన హాస్యం తో నవ్వించి కోపాన్ని తగ్గించుకునేలా చేయవచ్చు .
నవ్వడం వల్ల ‘ఎండార్సిన్‌’ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల కొన్ని మానసిక , శారీరక రుగ్మతలు తొలగిపోతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి నవ్వు ఒక సులభమైన మార్గం.
సందర్భాన్ని బట్టి నవ్వులు అనేక రకాలుగా ఉన్నాయి.
బోసి నవ్వు,చిరునవ్వు ,వెకిలినవ్వు,విరగబడి నవ్వు మొదలగునవి.
కొన్ని సందర్భాల్లో నవ్వును అదుపులో ఉంచుకోవడం కూడా అవసరం.
అసందర్భంగా నవ్వడం వల్ల యుద్దాలే జరిగాయని మన పురాణాలు చెప్తున్నాయి.ఎదుటివారు అంగవైకల్యం తో ఉన్నప్పుడు , దారిలో వెళ్ళేటప్పుడు అనుకోకుండా జారికిందపడినవారిని చూసి హేళనగా నవ్వడం వెకిలినవ్వు. అలాగే ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం తో వక్రంగా నవ్వడం వంటిది దుష్ట మైన నవ్వు. నవ్వుల వల్ల ఎదుటివారి మనోభావాలు దెబ్బతిని వారి దృష్టిలో నవ్వినవారి వ్యక్తిత్వం కుంటుపడుతుంది. అలా నవ్వే వారి స్వభావాన్ని గ్రహించి వారికి దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది.
***

9985525355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లలిత సంగీత గీతం

‘ ఎర్రరంగు బురుద’