పౌరాణిక స్త్రీలు**

ఉత్తర

కామేశ్వరి

.. మహాభారత కాలం నాటి కురు వంశాన్ని అంతరించిపోకుండా నిలిపిన ధన్యజీవి ఉత్తర. మహాభారతము మరియు భాగవత పురాణములోనూ కనిపించే పురాణ చక్రవర్తిని కన్న కీర్తి శాలి ఉత్తర.
మహాభారత ఇతిహాస ప్రకారము ” ఉత్తర ” మత్స్య రాజ్యానికి రాజైన విరాట రాజుకి ముద్దుల కూతురు మరియు సార్వభౌమాధికారి ఉత్తర కుమారునికి సోదరి. ఈమె పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో, పేడి రూపంలో బృహన్నల అనే నామంతో నున్న అర్జునుని వద్ద నృత్యం అభ్యసించింది. ఆయన ఎంతో శ్రద్ధతో నృత్యం యొక్క ప్రత్యేకతలను నేర్పించాడు.
ఉత్తర గోగ్రహణం జరిగిన తర్వాత విరాట్ రాజు కి ఇన్నాళ్లు తన కొలువులో మారువేషంలో ఉన్న పాండవులని తెలిసింది. తన తప్పు గ్రహించి ఎన్నో విధాల వేడుకున్నాడు. అప్పటికే అర్జునుని బలపరాక్రమములు వినిన ఉత్తర అతనిపై మనసు పారేసుకుంది. విరాట్ రాజు కూడా ఉత్తరను భార్యగా స్వీకరించమని అడిగాడు. కానీ అర్జునుడు ” ఉత్తరను తన చిన్న అమ్మాయిగా భావిస్తున్నానని తన కుమారుడైన అభిమన్యునికి ఉత్తర నిత్య వివాహం చేయమంటాడు.
కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు హత్యకు గురైనప్పుడు ఉత్తర వితంతువుగా మారింది. కౌరవుల శ్రేయోభిలాషి అయిన అశ్వద్ధామ పాండవుల వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని తలచి ” అపాండ వాస్త్రము ” వదిలాడు. శ్రీకృష్ణుడు తన శక్తితో ఆ ఉత్తర గర్భ పిండాన్ని రక్షించాడు. ఆ పిల్లవానికి ” పరీక్షితు ” అని నామకరణం చేశారు. యుధిష్ఠరుని తరువాత పరీక్షితు పాండవుల తరఫున సింహాసనమదిష్టించాడు.
ఉత్తర మంత్ర ము గుద్దులను చేసే అందగత్తె మరియు ప్రతిభా పాటవాలు కలిగిన మహిళ. ఆమె తన యవ్వన వయసులోనే తన ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయింది. ఆ దుఃఖంతో తను కూడా తన భర్తతో అగ్నిలో ప్రవేశించి సహగమనం చేయడానికి విద్యుత్తురాలైన ధైర్యశాలి. శ్రీకృష్ణుడు అడ్డుకొని, ఓదార్చి… నీ గర్భంలో ఉన్న ఈ ఒక్కడే పాండవులకు ఉత్తరాధికారి. అందుచేత వీనిని పెంచడం నీ ముందు ఉన్న కర్తవ్యం” అన్నాడు. అలాగే ఆమె పరీక్షితును పెంచి పెద్ద చేసి పాండవ వంశానికి మూలస్తంభమైంది

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనోజ్ఞ పాడిన ‘మగువ’ పాట

కళాతరుణి