తరుణి చిత్రం

చిత్ర కవిత

ఒక కొమ్మకు పూసిన ఆలోచనలు
ఊహలు రాల్చిన నేలమ్మకు
నీవనే ఓ బ్రతుకు బండి
నడకకు నేర్పిన నిజ దృశ్యాలు

బంధమే నీ బాధ్యతై
నీవు నడిపించిన బాటై
ఆధునిక సోయగాల
అనంత తీరుతెన్నుల
కష్ట సుఖాల కాల ప్రభావాలు

తీరక రంగుల ఋతురాగాలు
రాలిన ప్రతి ఆకు కొత్త వేదాంత దర్శనం
హృదయమనే చెట్టుకు
పూసిన గుండె పువ్వులు

పువ్వుల కోసం
ఆకుల కోసం
వేళ్ళ తో నో
మోడు తోనో
కలిమిలేముల
బ్రతుకునావ
కనిపించిన ఆకాశమే ఇక
ఆధారం!
రంగులు ఏం చెప్తాయ్?
నీవు ఓ అచంచల భావ సంచయనమని!!

  – కొండపల్లి నీహారిణి,తరుణి సంపాదకురాలు.                           చిత్రకారిణి-R. భాగ్య, మహబూబ్ నగర్

Written by Bhagya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి బాలచిత్రం

చందమామ కథ