మానవత్వం పూలతోటలో మనుషులంతా ఒక్కటేనని
పాడరా ఓ భారతీయుడా పాడరా ఓ సోదరా ||మా||
ప్రజారాజ్యం ప్రజాస్వామ్యం ఆశయాలకు ఆలవాలం
అని పాడరా ఓ తమ్ముడా అని పాడవే ఓ చెల్లెలా ||మా||
పల్లెపల్లెకు పాఠశాలలు భావి పౌరుల ప్రగతి బాటలు
అని పాడరా ఓ తమ్ముడా అని పాడవే ఓ చెల్లెలా ||మా||
సర్వమతముల సామరస్యం సర్వజనులకు సౌఖ్యదాయం
అని పాడరా ఓ తమ్ముడా అని పాడవే ఓ చెల్లెలా ||మా||
మంచి ఒకటే నిలుచునపుడు పరుల పంచన చేరకెపుడు
వంచన మదిలో నెంచక చిరకీర్తి పొందర సోదరా ||మా||