సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే

 ప్రముఖ రచయిత రేవిణి పాటి రమాదేవి గారితో వంగ యశోద దేవి ఇంటర్వ్యూ

ఉమ్మడి సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆమె పియుసి తో చదువుకు కామా‌ పెట్టి గృహిణి గా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి కుటుంబం లో అనేక పాత్రలు .పోషిస్తూ భర్త సహకారంతో డిగ్రీ పూర్తి చేసి సాహిత్యం లో రాణిస్తున్నారు. ఆమె జన్మించింది బరంపురం‌‌ ‌లో పెరిగింది ఆంధ్ర లో భర్త ఉద్యోగరీత్యా ఎక్కువ కాలంజంషెడ్ పూర్ లో నివసించారు. అక్కడ ‌మహిళల సమితిలో 22 సంవత్సరాలు అనేక పదవులు నిర్వహించారు. ఆమే
రేవిణి పాటి రమాదేవి గారు. ఈ వారం తరుణి విశిష్ట అతిథి
ఆమె తో ముఖాముఖి తరుణి పాఠకుల కోసం ప్రత్యేకం….
తరుణి: నమస్కారం రమాదేవి గారు. మీ గురించి మా తరుణి మిత్రుల కోసం చెప్పండి..


రమాదేవి: నమ‌స్కారం.
నా పేరు రేవిణి పాటి రమాదేవి
నేను ఒడిస్సా బరంపురంలో జన్మించాను. మా నాన్నగారు మంత్రి ప్రగడ వరాహ నరసింహం తాసిల్దార్ అమ్మ బాధ్యతగల గృహిణి మంత్రిప్రగడ లలితా దేవి నాకు ఒక్కతే చెల్లెలు కస్తూరి భారతీరామం తను కూడా రచయిత్రి. ఆంధ్రలో పెరిగాను. అక్కడే చదివాను.
చిన్న వయసులోనే గృహిణి పోస్టులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది.
మెడిసిన్ చదవాలని కోరిక ఉండేది. అది పూర్తికానివ్వ లేదు పెద్దలు. దాంతో పియుసితో చదువు ఆగిపోయింది. పెండ్లి తర్వాత
30 కుటుంబ సభ్యులు ఉన్న పెద్ద ( ఉమ్మడి )కుటుంబంలో కోడలిగా వెళ్లాను. జీవిత భాగస్వామి రేవిణి పాటి గోపాల్ రావు. అకౌంట్స్
ఆఫీసర్. ఆయన ఉద్యోగరీత్యా బీహార్ , ఝార్ఖండ్, జంషెడ్పూపూర్ ఉన్నాం.‌ మాకు ఇద్దరు పిల్లలు.
మా అబ్బాయి ఆర్.వి. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈవో ఏ ఎం ఎం ఎస్ ఇండియా(arcelor mittal nippon steel india )
ఆర్.పద్మ వైస్ ప్రెసిడెంట్ గ్రీన్ విజన్ మాబ్బాయి పిల్లలు :
డాక్టర్ ఆర్. శ్రద్ధ ఎంబిబిఎస్ ఎం జిఎం కాలేజీ బొంబాయి
ఆర్.అభిషేక్ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ బి ట్స్ హైదరాబాద్


మాఅమ్మాయి:
స్నేహలత సోమయాజుల
Working as –india people
Partner company —look out inc.
మా అమ్మాయికి ఒక కొడుకు కూతురు కొడుకు ఆదిత్య సోమయాజుల కెనడా టొరెంటో లో కంప్యూటర్ సైన్సు యోర్క్
యూనివర్సిటీ లో చదువు తున్నాడు
శ్రీయా భగవతి సోమయాజుల బొంబాయిలో పెరల్ అకాడమీ ఫ్యాషన్ డిజైనింగ్ లో థర్డ్ ఇయర్ స్టూడెంట్.
తరుణి: పెళ్లి తర్వాత మీరు చదువు కొనసాగించడంతో పాటు మీరు కోరుకున్న వైద్య విద్యలో శిక్షణ పొందారు. ఇది ఎలా సాధ్యం అయ్యింది?
రమాదేవి: మా వారిది
మహోన్నతమైన వ్యక్తిత్వం. ఆ ఆయన నాకు దైవ ప్రసాదంగా లభించారు. మనసెరిగిన స్నేహితుడు, ప్రేమను పంచే ప్రేమికుడు, నా బాటలో పువ్వులు పరిచిన మానవతావాది.
వివాహం అయిన తర్వాత గ్రూప్ మార్చుకొని బిఏ డిగ్రీ పూర్తి చేశాను. శ్రీవారి సహచర్యంలో సాహిత్య అభిలాష మరింత పెరిగింది.
దాంతో పుస్తకాలు చదవడం, చదివిన దానిపై విమర్శలు రాసుకోవడం చేసేదాన్ని. చిన్నప్పుడు
స్కూల్ మ్యాగజైన్లులో కవితలు వ్యాసాలు రాయడం అలవాటు. ప్రముఖ రచయితలు శరత్ , చలం సాహిత్యం, విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు పై మక్కువ ఎక్కువ బిఏ లో స్పెషల్ తెలుగు తీసుకున్నాను.
తెన్నేటిహేమలత గారు నా ఇష్ట రచయిత్రి వారి రచన నవల పాంచాలి లత గారి చేతుల మీదుగా అందుకున్నాను
జంషెడ్ పూర్ లో 17 ఆంధ్ర ఏసోసియేషన్స్ ఉండేవి అన్నిటికి రచనలు చేసేదాన్ని.
నేను జంషెడ్పూర్ లో ఆంధ్ర మహిళల సమితిలో 22 సంవత్సరాలు అన్ని పదవులు చేశాను.
వైద్యం మీద మక్కువ తీరిక
హైదరాబాద్ వచ్చాక ప్రాణిక్ హీలింగ్, కాడ్ హిలింగ్, క్రియాయోగం, క్రియాశక్తి కోర్సులు చేశాను. బొంబాయిలో క్రిస్టల్ పిరమిడ్ హీలింగ్స్ , సిద్దామృత సూర్య కిరణ క్రియాయోగం, ప్రజెంట్ లైఫ్ రిగ్రెషన్ తెరపి, రేఖి సైకిక్ సర్జరీ కోర్సులు పూర్తి చేసాను.
పంచ వీరభద్ర యూనివర్సిటీ నుండి ‘సైన్స్ ఆఫ్ చక్ర, ఆన్లైన్ క్లాసెస్ చేసేను 1st క్లాస్ వచ్చింది.
సంస్కృతం 1st లెవెల్
పాస్ అయ్యాను. ఇప్పుడు ఫుడ్ థెరపీ చేస్తున్నాను.

తరుణి: ఒడిషా లో పుట్టి ఆంధ్ర లో పెరిగి వివిధ రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మీరు ఇతర రాష్ట్రాలలో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే వారా?
రమాదేవి: కమ్మనైన తెలుగు భాష ప్రేమికులు, అభిమానులు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. అక్కడ తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్నేదాన్ని. అంతే కాదు జంషెడ్పూర్ లో ఆంధ్ర మహిళల సమితిలో 22 సంవత్సరాలు అన్ని పదవుల్లో పని చేశాను. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైంది.
తరుణి: మీ రచనల గురించి చెప్పండి.
రమాదేవి: కథలు, వ్యాసాలు, కవితలు, నానీలు, లఘు కవితలు, సూక్ష్మ కావ్యాలు ఇలా అనేక ప్రక్రియలు రాసాను. నా రచనలు
వివిధ పత్రికల్లో వచ్చాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి రెండు నాటికలు ప్రసారమైనాయి ఆధ్యాత్మిక జగత్తులో హిందీ మూలం నుండి తెలుగు అనువాదాలు చేశాను. పౌరాణిక సాహిత్యల్లో నా మొదటి కావ్యరచన “సుందరాకాండ.”
ప్రేమనగర్ లో శిధిల శిల్పాలు, పడగ నీడ రెండు నవలలు వచ్చాయి. కవితా సంపుటీలు పూల సింగిడి,
కవతా మేఘమాల, అనుబంధాల పూతోట, అమృత వర్షిణి,
ఎయిడ్స్ కథల సంపుటి ఆశాదీపం.
అక్షర ప్రభాతం కవితల సంకలనం ముద్రణలలో ఉన్నాయి
స్వరాలు,తేనియలు,
ప్రస్తుతం 4,5ఛానల్స్ కి నిత్యము కవితలు రాస్తూ వుంటాను.
తరుణి: మీరు అందుకున్న బహుమతులు, బిరుదులు?
రమాదేవి: చాలానే ఉన్నాయి.
ప్రపంచ మహిళా తెలుగు కవిత మహోత్సవంలో సర్టిఫికెట్
అంతర్జాతీయ మహిళా వారో త్సవాలలో మార్చ్ 12వతేదిన కవిత చదివాను.
Atta special souvenir లో
నా కవిత వచ్చింది. ఎయిడ్స్ కవితా సమారోహంలో హైదరాబాద్ లో పాల్గొన్నాను
అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా హైదరాబాదులో
కవి సన్మానం అందుకున్నాను.
ఇప్పటివరకు వచ్చిన బిరుదులు ..కవితా భూషణ్, కవితా విభూషణ్, సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న, కలం భూషణ్ .
మనస్ఫూర్తిగా సంతోషించి ఆశీర్వదించే వారి ఆశీస్సులు, సంతోషాన్ని పంచుకునే వ్యక్తుల కలయిక అంటే ఇష్టము
అందరూ కలసిమెలసి వుండాలనే భావన..
అవుసరమైనవారికి చేయూత నివ్వడమనేది మా తల్లితండ్రులు నుంచి,
మానవత్వంతో మెలగాలానేది మా అత్తమామగారి నుండి సంస్కారం.

తరుణి: నేటి మహిలకు మీరిచ్చే సూచన, సలహా…
రమాదేవి: సూచనలు, సలహాలు చెప్పే అంత గొప్ప దాన్ని కాదు. ప్రకృతి పరంగా మహిళల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. ఆ శక్తి నా యుక్తి గా వాడాలి. పుట్టిన ఇంటికి, తాను కోడలిగా వెళ్లిన ఇంటికి వారధి…ముందు తరానికి, రానున్న తరానికి వారధి తానే అన్ని విషయం గుర్తుంచుకోవాలి. తన అభిరుచులను జీవిత భాగస్వామితో పంచుకోవాలి. అప్పుడే ఆమెకు తాను ఎంచుకున్న రంగంలో ప్రగతి సాధించడానికి అవసరమైన సహకారం కుటుంబం నుంచి అందుతుంది. ఇది నా జీవితంలో నేను తెలుసుకున్న విషయం.

వంగ యశోద

Written by vanga Yashoda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సీతా రామ కళ్యాణం

ప్రజాస్వామ్యం