“నిజమైన పొందిక”

కథ

సుంక ధరణి

“అరే…అభీ…లేరా! స్కూల్ టైం అయ్యింది. త్వరగా లేచి రేడీ అవ్వు. ఈవెనింగ్ ఇంటికొచ్చాక ఎగ్జిబిషన్ కి వెళ్దాం”. నా మాటకి పన్నెండెళ్ల అభీ చటుక్కున “హే..హే..ఓకే డాడీ, ఇప్పుడే రేడీ అవుతా.. ఈవెనింగ్ అక్కడ నాకు ఏం కావాలన్నా కొనివ్వాలి” ఎంతో ఉత్సాహంతో లేచి,స్నానానికి బయల్దేరాడు.

“సర్లే రా..కొనిస్తాను..” అంటూ హాల్లోకి రాగానే ఫోన్ మోగింది. అవతల ఆఫీస్ నుండి కాల్, ఎత్తగానే “హాలో! సార్, ఈ సారి కూడా మనకు ప్రాజెక్టు మిస్ అయింది. ఆ ఆనంద్ వాళ్ళ కంపెనీకే వచ్చింది. సోరీ, సార్ చాలా ప్రయత్నించాం!” అంటూ కాల్ కట్ చేసారు. నేనేం బదులివ్వలేక, మనసంతా నిరాశతో నిండిపోయి అక్కడే కూలబడిపోయి ఆలోచనలో మునిగిపోయా…

“ఏవండీ..! అభి రేడీ అయ్యాడా స్కూల్ కి” అంటూ గుడి నుండి వచ్చింది కమల. నేనేం సమాధానం చెప్పకపోయే సరికి “ఏవైందండీ, పిలిస్తే పలకరేంటీ! ఎందుకిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు..” భుజం తడిమింది. “ఇది ఆరో ప్రాజెక్ట్ కమల. ఎలాగైనా మాకే రావాలని చూసా,కానీ ఆ ఆనంద్ వాళ్ల కంపెనీ నాకు ప్రతిసారి అడ్డొస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్న, ఇపుడు అవి తుడిచిపెట్టుకొని పోయాయి” కిరణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

తలుపు పక్కన నుండి ఇదంతా చూస్తున్న అభీ నా దగ్గరకు వచ్చి “ఏం, పర్లేదు డాడీ! నెక్ట్స్ ప్రాజెక్ట్ మనదే” వాడి చిన్ని చేతుల్తో నా చెంపల్ని తుడుస్తూ ఓదార్చడు.
“కానీ ఆ ఆనంద్ గాడ్ని అసలు వదలను” ఉక్రోషంతో అరిచాను.
“కూల్, కిరణ్… ఇప్పుడు అయ్యిందానికి ఏం చేస్తావు. మొదలు అభీని స్కూల్లో దింపేసి, నువ్ కూడా ఆఫీస్ కి రేడీ అవ్వు” కాస్త మందలించినట్లు చెప్పింది కమల.
అభీని స్కూల్ లో దింపి, ఆఫీస్ కు వెళ్ళాడు కిరణ్.

“గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్..! అనుకున్నట్లే, మొన్న జరిగిన పరీక్షల్లో వచ్చిన మార్కులు చేప్పి, క్లాస్ లీడర్ ని అనౌన్స్ చేస్తా”అని టీచర్ చెప్పగానే అందరూ బిక్క మెహంతో సరే అన్నారు.

“అలాగే, రేపు ‘ఫ్రెండ్షిప్ డే’ సెలెబ్రేషన్స్ ఉన్నాయి గా మన స్కూల్లో…. దానికి ఒక చిన్న గేమ్ ఆడదాం. ఆ తర్వాత పాఠంలోకి వెళ్దాం” పాలిపోయిన పిల్లల మొహాల్లో ఉత్సాహం నింపేలా చెప్పారు టీచర్.
“ఓకే..టీచర్” మెరుస్తున్న కళ్లతో జవాబు ఇచ్చారు.
“హా…మొన్నటి పరీక్షల్లో ఎక్కువ మార్కులొచ్చింది కిట్టుకి..588/600.. సో!ఈ సారి క్లాస్ ఫస్ట్ కిట్టు..”
కిట్టు ఆనందంతో డయాస్ పైకి వెళ్తాడు..

ఇంతలోనే “ఎక్స్యూజ్ మేడం..! నేను కిట్టు వాళ్ల ఫాదర్ ని, కిట్టు లంచ్ బాక్స్ మర్చిపోతే ఇవ్వడానికి వచ్చా” ఆనంద్ అనగానే
“హా..రండి రండీ..! మీ అబ్బాయి ఈ సారి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఆ విషయమే మాట్లాడుతున్నాం.” అని టీచర్ చెప్పగానే
“కంగ్రాట్స్ రా…” అని అభినందించి, బాక్స్ ఇచ్చేసి వెనుదిరుగాడు ఆనంద్.
ఇదంతా చూస్తున్న అభీ మనసులో చిన్న కోపం జ్వలించింది.

“తర్వాత… అభీ..!” అనగానే అయోమయంగా నిల్చున్నాడు.
“ఏంటీ, చాలా డల్ అయ్యావు.చాలా తక్కువ మార్కులొచ్చాయి. రేపు మీ పేరెంట్స్ ని నాకు కలవమను”
“అందరి ముందు ఆ కిట్టుని మెచ్చుకుని..నన్ను తిడతావా..నీ పని చెప్తా చూడు” మనసులో గునుక్కుంటూ కూర్చున్నాడు అభీ.
“ఇక, ఫ్రెండ్ షిప్ డే గేమ్ ఏంటంటే, అందరూ ఒక చీటి తీసుకుని మీ ఫ్రెండ్ పేరు అందులో రాసి ఇవ్వండి.. రేపు ప్రోగ్రాం లో అనౌన్స్ చేద్దాం” అని టీచర్ చెప్పగానే
అందరూ చకచకా రాసి ఇస్తారు.. బెల్ మోగింది
“సరే..పిల్లలు.. రేపు చూద్దాం” టీచర్ వెళ్లిపోతుంది.

అభీ మనసులో చుట్టుకున్న కోపం “మా నాన్న విషయంలో, నా విషయంలో ఈ తండ్రి కొడుకులు తొక్కేస్తున్నారు. ఎలాగైనా కిట్టుగాడి పని చెప్పాలి” అనుకుంటాడు.
సాయంత్రం అయింది. “అరే..కిట్టు, పదా మనం గ్రౌండ్ కి వెళ్లి ఆడుకుందాం” అభీ మాటకి “సరే రా..!” అని ఇద్దరూ బయల్దేరారు
“అరే..స్టోర్ రూం లో క్రికెట్ బ్యాట్ ఉందేమో చూసి, తీసుకు రా.. నేను గ్రౌండ్ లో వెయిట్ చేస్తా”అని అభీ చెప్పగానే. “ఓకే రా…” అని స్టోర్ రూంకి వెళ్తాడు.
ఇదే అదును అనుకొని ఎవరు చూడని సమయంలో కిట్టుని లోపలే ఉంచి, తలుపులు మూసి తాళం వేసి,
ఏం తెలీనట్లు చేతులు దులుపుకొని క్లాస్ కి వెళ్తాడు. ఇంటికెళ్లే సమయం అవుతుంది. పిల్లలందరూ ఇంటి బాట పడతారు.
“హమ్మయ్యా!!!ఈ రోజుతో వీడి పని ఫినిష్” లంకెలేసుకుంటూ ఇంటికెళ్తాడు అభీ.
సాయంత్రం యేడుకావస్తుంది. బిక్కుబిక్కుమంటూ ఆ స్టోర్ రూం చీకట్లో “మమ్మీ…మమ్మీ…అని ఏడుస్తూ” ఉండిపోయాడు కిట్టు.
కిట్టు కోసం వాళ్ల తల్లిదండ్రులు చుట్టూపక్కలా వాళ్లని, స్నేహితుల్ని అడుగుతారు. చివరికి స్కూల్ కెళ్లి ప్రిన్సిపల్ ని కలుస్తారు.
“సర్, మాకిట్టు ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్లో ఉన్నాడేమో అనుకుంటే ఇక్కడ కూడా లేడు” కంగారుతో చెప్తాడు ఆనంద్.
“స్కూల్ లో  ఐతే ఎవరు ఈ టైం వరకు ఉండరండీ!! మేమే మా పనులన్నీ పూర్తి చేసి వెళ్లాలనుకుంటున్నాం. అయినా ఫ్రెండ్స్ తో కలిసి బయటికెళ్లాడేమో.? కనుక్కోండి”

“అయ్యో! లేదు సార్ అందర్నీ అడిగాము. ఎవరు చూడ్లేదు.అంటేనే ఇక్కడికొచ్చాము. కానీ…..” ఆనంద్ మాటలు పూర్తి అవ్వకముందే,
“సార్…అభీ ని, కిట్టుని సాయంత్రం గ్రౌండ్ వైపు వెళ్తుంటే చూసా…!?” పక్కనే వున్న అంటెండర్ సందేహాత్మకంగా చెప్పి,
“హుర్రే…స్టోర్ రూం తాళాలు అక్కడే మర్చిపోయాను. వెళ్లి తెస్తాను సార్” స్టోర్ రూమ్ వైపుకు పరిగెడతాడు అంటెండర్.
తాళాలు వెతుకుతుండగా “మమ్మీ…మమ్మీ…”అంటూ ఏడుపు వినిపించడంతో, తాళం తీసి చూడగానే నిస్సహాయ స్థితిలో పడివున్న కిట్టుని చూసి
“బాబు కిట్టు…లే…లే…అసలు ఇక్కడికేలా వచ్చావు” ఎత్తుకొని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్తాడు. జరిగిన విషయం కిట్టు ద్వారా తెలుసుకొని…

మర్నాడు.. ఉదయం ప్రిన్సిపల్ ముందు అభీ,కిరణ్ ఓ వైపు; కిట్టు, ఆనంద్ మరో వైపు…
“ఏటండీ! మీ అభీ చేసిన పని. ఇలా తయారయ్యాడు. మీకు మీకూ బిజినెస్ లో ఎన్ని గొడవలున్నా, వాటిని మీ పిల్లల మీద ఎందుకు ప్రభావితం చేస్తారు.” ప్రిన్సిపల్ మాటలకి తల ఎత్తలేకపోయాడు కిరణ్.
“ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ ఐతే స్కూల్ లోంచి సస్పెండ్ చేస్తాను అభీ..! గుర్తుపెట్టుకో…ఇక క్లాస్ రూంకి వెళ్లండి” విసుగుతో గట్టిగా మందలించాడు.

బయటికి రాగానే “కిట్టు విషయంలో ఎందుకిలా చేసావ్ రా..? నువ్వు కిట్టు నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి..అతనిలా క్లాస్ ఫస్ట్ రావాలి” కిరణ్ అభీతో చెప్పేలోగానే “అదేం లేదు డాడీ..! వాళ్ల నాన్న నిన్ను బిజినెస్ లో ఎలా దెబ్బతీసాడో, వీడు కూడా నన్ను క్లాస్ లో అవమానపడేలా చేసాడు” అంటూ క్లాస్ లోకి వెళ్ళిపోతాడు.

“నేను కోపంలో అన్న మాటలు ఆ చిన్ని మనసులో ఇంత క్రోధానికి దారి వేసాయా” మనసులో అనుకుంటూ వెనుదిరిగాను.
“చూడు కిరణ్, మన పిల్లలు మన తర్వాత మన కన్నా ఎక్కువ పేరు, ప్రతిష్ఠలతో బతకాలని మనం కోరుకుంటాం. దాని కోసం వాళ్లకి కావాలసినవన్నీంటితో పాటు సుఖసంతోషాలని కూడా ఇస్తాం.వీటితో పాటు మన హ్రృదయాలను మలినం చేసే గతానుభవం, మనం నిర్ధారించుకున్న మంచి చెడులు అందిస్తాం.. ఇవన్నీ వాళ్లలో తట్టుకునే శక్తిని, ఎదురు నిలబడే పటిమను ఇవ్వాలి. అంతేగాని వారి మనసులో ద్వేషం అనే విత్తనాలను చల్లకూడదు. ఈ వయసులో మన మాటలే వాళ్లకి వేద వాక్కులు. కాబట్టి మనల్నే అనుసరిస్తారు. తల్లిదండ్రులుగా మనం వాళ్లకి ఏ పద్దతిని అలవర్చామో తెలుసుకోవాలి.. అన్నట్లు నిన్న మీకు మిస్ అయిన ప్రాజెక్ట్, తిరిగి మీకే సాన్షన్ అయింది.. ఎనీవే..కంగ్రాట్స్..” షేక్ హ్యండ్ ఇచ్చి చిరునవ్వు తో కిరణ్ ని చూసి వెళ్లిపోతాడు ఆనంద్.

తను చేసిన తప్పెంటో తెలుసుకుని ఇంటికి వెళ్తాడు కిరణ్.
ఇక ఫ్రెండ్ షిప్ డే ప్రోగ్రాంలో  “నిన్న రాసిన చీటీలు ఓపెన్ చేస్తున్నా” టీచర్ అనగానే పిల్లలందరూ చప్పట్లతో అరిచారు.
ఒక్కో చీటి చదివి వినిస్తుంది…అప్పుడు కిట్టు వంతు వచ్చింది..   “కిట్టు రాసిన అతని బెస్ట్ ఫ్రెండ్ పేరు ‘అభీ’ క్లాప్స్ స్టూడెంట్స్” అనగానే
కిట్టు చిరునవ్వుతో అభీ ని చూసాడు. పాశ్చాత్తాపంతో అభీ వచ్చి కిట్టుని గట్టిగా కౌగలించుకొని ఏడుస్తాడు.

Written by Sunka Dharani

పేరు: సుంక ధరణి
తండ్రి పేరు: సుంక నర్సయ్య
తల్లి పేరు: సుంక లత
వృత్తి: విద్యార్థి (ఎమ్మెస్సీ.బోటనీ-ప్రథమ సంవత్సరం)
కళాశాల: కాకతీయ విశ్వవిద్యాలయం
రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం)

చిరునామా: ఇం.నెం: 9-7-96/9,
గణేష్ నగర్,
రాజన్న సిరిసిల్ల జిల్లా
505 301
ఫోన్: 8978821932
మెయిల్‌: dharanisunka19@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా లాగ ఎందరో

మన మహిళామణులు