పులి బోను లోకి పిల్లల్ని తోసేదీ మనమే
చంపిందంటూ పులిపై పిర్యాదు చేసేదీ మనమే
పులికి బలివ్వడానికి కనలేదు పిల్లల్ని
పిలానీ బిట్స్ కి కొలమానంగా కనలేదు పిల్లల్ని
విదేశాలను ఉద్ధరించడానికి కనలేదు పిల్లల్నీ
పక్కవాళ్ళ పిల్లలకంటే ఎక్కువ ప్యాకేజీ సంపాదించడానికే కనలేదు పిల్లల్నీ
మన ప్రిస్టేజి పెంచే సాధనం కాదు పిల్లలు
ఆదాయం పెంచే సదుపాయం కాదు పిల్లలు
వాళ్ళ స్వాతంత్ర్యాన్ని కాలరాసే అర్హత మనకెక్కడిది
వాళ్ళని యంత్రాలుగా తాయారు చేసే అధికారం మనకెక్కడిది
పిల్లలతో గడపలేక, సంస్కారం నేర్పించే సమయం మనకు లేక
చేయి దాటి పోయారంటూ
దారిలో పెట్టాలని బోనులో వేస్తున్నాం
ఈ మేధం లో బంధాలను OMG గా, మనుషులంటే ఎలర్జీగా తయారు చేస్తున్నం
కొండ నాల్కకు మందుపెట్టే క్రమంలో ఉన్న నాలికనే ఊడగొట్టు కుంటున్నం