తలగడ నీవే నా మనుగడ
తల మునకలుగా పనిచేసి అలసిన నాకు విశ్రాంతి నిస్తావు
సంతోష సమయాన
నాతో ఆనందం పంచుకుంటావు
సరదాగా నాతో ఆడుకుంటావు
మనసు కృంగివేదన ననుభవించే వేళ
నీలో నా తల దాచుకుంటావు
వెతలతో వేదనతో చిందించే కన్నీళ్లు
తుడిచి ఊరటనిస్తావు.
ఒంటరియైన జీవితానికి
జంటవౌతావు.