శ్రీమతి డి. కమలగారు:- సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను తన కథలలో అద్దంలా చూపించారు. చక్కని సందేశం అందించారు. ప్రతిసమస్యకు పరిష్కారం చూపించారు. స్ఫూర్తి ప్రదాయకమైన సందేశాత్మకమైన కథలను నేటి సమాజానికి అందించాలనే సంకల్పముతో ఈ పుస్తకం ప్రచురించారు.
1) అమ్మమాట:- ఉద్యోగినులు ఇంటా బయట ఎంత వత్తిడికి గురి అవుతున్నారు. అయినా విధి నిర్వహణ చక్కగా చేస్తూ వున్నారు. అన్న విషయం ఈ కథలో చూపించారు. అమ్మ మనస్సును ఆవిష్కరించారు.
2) జనారణ్యం:- ఈ కథలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పడుతున్న భయం, ఆందోళన, సమాజ తీరుతెన్నులు చక్కగా చిత్రించారు.
3) జ్ఞానోదయం : – కథలో స్మార్ట్ ఫోన్స్ మహాత్యంలో పడి మనుష్యుల మధ్యన దూరం పెరిగిపోతున్నది. ప్రేమాభిమానాలు, విలువలు దూరమై పోతున్నవిషయంలో చక్కని పాత్ర పోషణతో కన్నులకు గట్టినట్లు వ్రాశారు.
4) సంతృప్తి:- ఈ కథలో బాల్యస్నేహితులు ఎన్ని సంవత్సరాలు గడిచినా గూడా వుండే ఆత్మీయత వారివారి జీవన విధానాలు. సమాజగమనంలో వస్తున్న మార్పులు చక్కగ చిత్రించారు. ఈ కథతో హృదయాన్ని స్పందింపజేశారు. 5) మూగవేదన:- డబ్బుకూడబెట్టడమే జీవితధ్యేయం అన్నట్లు ఆస్తులు పెంచే ఆరాటంలో జీవితి భాగస్వామి అయిన భార్య మనస్సును అర్థం చేసుకోని వారి గురించి చక్కని ఉదాహరణ ఈ కథ.
6) స్నేహం:- గొప్ప సమర్థత వుండి కూడా వారు పైకి రాలేరు. ఏదో న్యూనతా భావంతో నిర్జీవంగా మిగులుతారు కొంతమంది. వారిలో ధైర్యం పెంచితే ఎంత బాగా రాణిస్తారో ఈ కథ ద్వారా చూపించారు రచయిత్రి.
7) గుణపాఠం:- కుటుంబాన్ని విస్మరించి తిరిగేవాళ్ళు చివరకు ఏమౌతారో ఈకథలో చక్కగా వర్ణించారు.
8) శునకసందేశం:- మనుష్యులేకాదు మూగజీవాలు కూడా ఆత్మాభిమానం కలిగి వుంటాయని, వాటి ప్రవర్తన ద్వారా మనుష్యులను ఆలోచింపచేస్తాయనడానికి ఈకథ ఉదాహరణగా వ్రాశారు.
9) అమ్మమ్మ చెప్పింది కథలో నేటి విద్యార్థులు, యువకులు, యువతులు. పాఠ్యగ్రంథములో చదువుకున్న విషయాలకు భిన్నంగా, బయటి ప్రపంచం కనిపిస్తున్నది. పార్లమెంటు, అసెంబ్లీల విలువలు గొప్పగ రాజ్యాంగంలో ఉన్నాయి కాని ప్రత్యక్ష ప్రసారాలు చేసినపుడు గౌరవనీయ పెద్దలు అక్కడ చేసే వాగ్వివాదాల తీరు ప్రవర్తన తీరు అద్దంలో చూపినట్లు ఈ కథలో చూపారు. మేము విన్నది ఏమిటి చూస్తున్నది ఏమిటి అని విద్యార్థుల విస్మయం చక్కగా వ్రాశారు రచయిత్రి.
10) మాతృభూమి:- ఈ కథలో దేశాభివృద్ధి కోసం పాటుపడేవారు కొందరు. దేశంకోసం ప్రాణాలు అర్పించేవారు కొందరైతే దేశాన్ని దేశప్రజలను మోసం జేసి ప్రతిది కల్తి చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారి గురించి రచయిత్రి ఆవేదన భరిత కథను వ్రాశారు. దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే దేశప్రజల ప్రాణాలు తీసేవారు ఒకవైపు వుండి ప్రకృతిని ప్రేరేపించేటట్లు చేస్తున్నారని ఈకథ వ్రాశారు.
11) సహనం:- మంచి వ్యక్తిత్వం రావడానికి కులం, మతం, బీద గొప్ప కాదు అని చక్కని పాత్ర ద్వారా నిరూపించారు. సంస్కారంతో ఉన్నవాళ్ళను అందరు అభిమానిస్తారు అని ఈ కథ నిరూపించింది.
12) ఆకుకూరల ఆరవ మహాసభ:- ఈ కథ ఒక వైవిధ్యభరితమైనది. చక్కని సందేశం ఆకుకూరల ద్వారా రచనాప్రావీణ్యంతో నిరూపించారు. మనుష్యులు ఆరోగ్యం గురించి ఆకుకూరలు ఆవేదన పడి సభ పెట్టుకున్నాయి, చదవండి.