చిత్ర కవిత రచన
ప్రేమ మొక్కకు రెండాకులు మధురానుభూతిని
చిగురిస్తూ నేలమ్మ నుండి
మహోదయమవుతుంది
అమ్మతనం తన్మయత్వాన్ని
పొత్తిలై పెంచినప్పుడు
కమ్మని రాగమెత్తుకున్నట్టే
భావి బంగారు పూలనిచ్చే
రంగారు తనమంతా
మానసాకాసాన పరీమళమవుతుంది
తల్లిగా సిద్ధి పొందిన లలామ
అలా ఒక అనిర్వచనీయమైన
ఒక అనన్య సామాన్యమైన
కన్నవారి శ్రేయోభిలాషి గా
ఉన్నవారి ప్రేయోభిలాషిలా
చిగురించిన ప్రతిసారీ
సమస్త మానవాళి కి
తానే నిత్య శుభోదయమవుతుంది
డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి పత్రిక సంపాదకురాలు