జలజలపారే జలపాతం శ్రీమతి ఝాన్సీ కె.వి.కుమారి

ఆకాశవాణి పెక్స్ గా ఆమె సుపరిచితులు.భేషజం గర్వంలేని గోదారి.పిల్లలప్రోగ్రాంలో అక్కయ్య కు ప్రేమ లేఖలు తో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు.శ్రోతలకు అందులో రాసే అవకాశం ఇచ్చారు.వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచయిత్రి గా 2019లో కీర్తి పురస్కారం పొందారు.కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టారు.అమ్మనాన్నలు కలతోటి సుందర రత్నదీనమ్మ యోహాను గార్లు.(జాన్ మాష్టారు).మాతామహులు ఏలియాగారు హెచ్.ఎం.ఆయుర్వేదాచార్యులు.భర్తశ్రీ నల్లూరి బాబూరావు గారు వివిధ భారతి ఆకాశవాణిలో హైదరాబాద్లో ఐబిఎస్ డైరెక్టర్గారిటైర్ అయ్యారు.ఇద్దరు కొడుకులు యు.కె.లో ఉన్నారు.భారతీయులంతా ఒక్కటే అన్నదేనానినాదం అంటారు ఆమె. ఆమె మాటల్లో వివరాలు తెలుసుకుందాం
“ముందుగా నాముఖ్య ప్రోగ్రాంల గూర్చి చెప్తాను. ఈస్టర్ సందర్భంగా మృత్యుంజయుడు సంగీత రూపకం రచన వ్యాఖ్య సమర్పణ దేశభక్తి గీతాలు బేటీ పడావో బేటీబచావోపై
ఎన్నోనారచనలు ప్రసారం ఐనాయి 2003లోబెస్ట్ రైటర్ ప్రొడ్యూసర్ గా జి.వి.ఆర్.ఆరాధనపుర‌స్కారం అందుకున్నాను.2004లో నాకు వింతను సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ పొయెట్స్ న్యూయార్క్ వారు ఆహ్వానించారు.కలర్స్ ఆఫ్ లైఫ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ లో వచ్చింది.2016లో ఉత్తమ సాహితీవేత్త గా చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేశారు.సినారె జీవితసాఫల్య పురస్కారం సేవారత్న సన్మానం (throne of grace Bible college Hyderabad) అందుకున్నాను.మదర్ ఇండియా సింగ్స్ ది గోల్డెన్ సాంగ్ ఆఫ్ విక్టరీ అనే త్రిభాషా గేయం నిజామాబాద్ జిల్లాలో అన్ని బడులలో ప్రచారం చేసి ఆహూతుల ‌సమక్షంలో ప్రదర్శించటం గొప్ప మరపురాని అనుభూతి.మానవతావాది నారాయణ గురు జయంతి వేడుకలు ఆకాశవ…
అంగవైకల్యం పై(విరబూసిన శిలలు) సార్ సెంటర్ పై”నింగిలో మువ్వన్నెలు” పుత్తడి పూసింది అని ఆసియా లో ప్రధమస్థానం పొందిన అంకాపూర్ పసుపు పంట పై డాక్యుమెంటరీలు శ్రోతల ప్రశంసలు అందుకున్నాయి.
Christian writers and poets associatio cultural wing for reformation education monthly news magazine founder presidentని. ఉమెన్ సెక్యూరిటీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ నామినేటెడ్ మెంబర్ ఫర్ అవార్డ్స్ సెలక్షన్ సబ్ కమిటీ ఆన్ లిటరేచర్ ఆఫ్ ఎ.పి.స్టేట్ క్రిస్టియన్ కార్పోరేషన్ 2011_12 ఇంకాఆరాధనటి.వి.వార్షిక అవార్డు ల సెలెక్షన్ కమిటీ నామినేటెడ్ మెంబర్ గా బాధ్యతలు నిర్వహించాను.
తెలుగు యూనివర్సిటీ లోని.హెచ్.డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ.థియేటర్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎం.ఎ.పొలిటికల్ సైన్స్ ఎం.ఎ.ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను.రష్యన్ భాషలో సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా ఇన్ సినీ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చేశాను.36ఏళ్ళు రేడియో లో పనిచేసి2012లో రిటైరైనాను.ప్రస్తుతం జ్ఞానవాణి ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ ‌సెంటర్ స్టేషన్ మేనేజర్ గా ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ శుభవార్త టి.వి.టాక్ షో చేస్తున్నాను.కథ కవిత నాటకంరూపకంవ్యాసం గేయం నానీలు అనువాదం పత్రికా కాలమ్ ఆంగ్ల తెలుగు లో చేశాను.ఆడియో ఆల్బం తెలుగు మహాసభల ప్రత్యేక ప్రచురణ లో వ్యాసమంజరి ఇలా ఎన్నో ఎన్నెన్నో నాకలం గళం నుంచి వెలువడ్డాయి.నాకవితల్ని కలకత్తా శాంతి నికేతన్ ప్రొఫెసర్ కొండయ్య గారు హిందీ లో కి అనువాదం చేశారు.art is for heart sake అనేది నా అభిప్రాయం.కొన్ని కలంపేరుతో …


శ్రీ ఎన్.ఎం.జి.రామకృష్ణగారు నన్ను రచయిత్రి గా ప్రయోక్త గా తీర్చి దిద్దారు.
నాతి చరామి నాటకం నిజామాబాద్ జిల్లా శ్రోతల ప్రశంసలు అందుకుంది.హైదరాబాద్ వివిధ భారతి కి ట్రాన్స్ఫర్ ఐనాక రాసిన నాటకాలు అన్ని కేంద్రాల నుండి ప్రసారం ఐనాయి
ఇక నాబాల్యంలోకి తొంగి చూస్తే రేడియో మాకు ఒక్కరికే ఉండేది.ఆరోజుల్లో రేడియో సెట్ చుట్టు ప్రక్కల వారి కి ఓఅద్భుతం! నాటకాలు సినిమాలు ప్రసారం అయ్యేటప్పుడు మావాకిలి అరుగువరండా అంతా జనంతో కిటకిటలాడేది.ఓరోజు మాతమ్ముడు అర్ధరాత్రి దాకా చదువుకున్నాడని రేడియో పెట్టలేదు.వరండాలో గోంగూర ఏరుతున్న
నా దగ్గరకు అంతా వచ్చి”అమ్మడూ! రేడియో వార్తలు పెట్టు”అని అడిగారు.నేను రేడియో నుంచి వరండాలో పెట్టగానే అంతా చెవులు రిక్కించి మరీ వినటం నాకు ఆనందం ఆశ్చర్యం కలిగించింది.వచ్చిన వారందరికీ మాతాతగారు ఏదో ఒకటి తింటానికి పెట్టించే వారు.వేయించిన పల్లీలు పెసరపప్పు ప్రేమలో పోసి పెట్టేదాన్ని.అవి తింటూ రేడియో వినేవారి ఆనందం మాటల్లో చెప్పలేను.


నేను Iవిజయవాడ బిషప్ అజరయ్యస్కూల్ లో చదివేటప్పుడు నాన్న నాకు చిన్న పోర్టబుల్ రేడియో కొనివ్వటం నాజీవితం లో ఓపెద్ద మలుపు.1అక్టోబర్1976లో ఆకాశవాణి విశాఖ లోట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్ గా చేరాను.నాభర్తకూడా విజయవాడ కేంద్రంలో చేరటంతో నన్ను అక్కడకి బదిలీ చేశారు.1978లోనాతొలినాటిక “నన్ను క్షమించు” యువవాణిలో ప్రసారం ఐంది.దానికి 60లేఖలు రావటం థ్రిల్లింగ్!ఆపై మహిళా ప్రోగ్రాంలు సంసారం రన్నింగ్ రేస్! శ్రీ ఆర్.అనంతపద్మనాభరావు గారి ప్రోత్సాహం లభించింది.ఇక నాకు మంచి పేరు తెచ్చిన రూపకాలు ఏమంటే1రైలు ప్రమాదం లో కాలు పోగొట్టుకున్న లంకా అన్నపూర్ణ కొయ్య కాలుతో డాన్స్ చేయడం అంధులైనడాక్టర్ సత్యనారాయణ గారి నుండి గూర్చి రెండు కాళ్ళు చచ్చుబడిన బాలాజీ లపై డాక్యుమెంటరీలు చేయటం!మారేడియో స్టాఫ్ అంతా అన్ని ప్రోగ్రాం లలో ఆల్ ఇన్ వన్ గా పాల్గొనే వారం హెల్మెటోపాఖ్యానం షష్ఠిపూర్తి సమయసందర్భంని బట్టి రాసి ప్రసారం చేశాను.ఇవన్నీ ఓపుస్తక రూపంలో తేవాలని ఉంది.”

ఝాన్సీ గారు ఆల్ రౌండర్ గా తను వెలుగుతూ శ్రోతలకి కూడా రాసి పంపేలా ప్రేరణ ఉత్సాహం ఇచ్చారు.ఇప్పటికీ నన్ను గుర్తు పెట్టుకుని”ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారు?”అని పలకరిస్తూ హాయిగా కబుర్లు చెప్పే స్నేహశీలి.ఉత్సాహం నింపే ఉవిద! దాదాపు అన్ని దేశాలు తిరిగారు.
ఇజ్రాయెల్ పాలస్తీనా సియోల్ స్కాట్లాండ్ యు.కె.యు.ఎస్.ఎ. లో తన అనుభవాలను పుస్తకం గా తెస్తే ఎన్నో విషయాలు భావికి ఉపయోగం.🌷
ఈమె ఫోన్ 9010833014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కవిత

అమెరికా ఆకు రాలే కాలం- అందాల బతుకమ్మ