కవిత

రాధిక సూరి

నవరస భావోద్వేగ జనిత కవిత
కమనీయ సుధాసౌగంధినీ కవితే!

లలిత లావణ్య తరుణబింబోష్టి కవిత
దుర్మదాంధ చిత్తఛేద కాళికా కవితే!

ముకుళితస్నిగ్ధ వినయశీల కవిత
కదన కుతూహల నారీభేరీ కవితే!

బాధాతప్త మనోచాంచల్య కవిత
మందస్మిత వదనారవిందా కవితే!

శపిత మందార మధూలిక కవిత
రమణీయ విలాస తటిల్లతా కవితే!

కల్లోల విలాప విహ్వలనేత్ర కవిత
సుందర ఆహ్లాద వినోదినీ కవితే!

జాజ్వల్యమాన శుభానన కవిత
కోమల శైత్య చంద్రద్యుతికా కవితే!

-రాధికాసూ

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజమైన పండుగ

జలజలపారే జలపాతం శ్రీమతి ఝాన్సీ కె.వి.కుమారి