ఆడపిల్ల ఆధిక్యత

అరుణానంద, విజయవాడ 7780380144

ఆడపిల్ల అన్న శబ్దం వినగానే చాలా చులకన భావం ప్రతివారికి. వారికాభావం ఎందుకు కలుగుతుందో వారికే అర్థం కాదు గర్భంలో ఉన్న బిడ్డ స్త్రీ శిశువు అని తెలిస్తే గర్భస్రావం చేయించుకోవడానికి కూడా సిద్ధమయ్యే తల్లులు. తమ జీవితాన్ని ఒక్కసారి సమీక్షించుకుంటే ఆ పని చేయగలరా? ఇవాళ కొన్ని దేశాలలో ఆడబిడ్డ జన్మిస్తే జీవితకాలం ఆ బిడ్డ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. బాలిక, విద్యార్థిని, యువతి, ప్రౌఢ, వృద్ద, మాత అన్నఅన్న శబ్దాలు ఆమె జీవితానికి ప్రతిరూపాలు ప్రతి అవస్థను ఎదుటివారికి ఆనందాన్ని కలుగజేయడమే తప్ప ఎవరికి బాధ కలిగించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. అసలు పుట్టుకతోనే నమ్రతతో సున్నిత మనస్తత్వంతో ఈ భూమి మీదకు వస్తుంది.
చంటి పిల్లగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. చక్కటి చిరునవ్వుతో నడకలు నేర్చి అడుగులు వేస్తున్న సమయంలోనే కాలికి గజ్జెలు కట్టే పట్టు బట్టలను సింగారించుకొని అడుగులు వేస్తూ ఉంటే ఆ ఇల్లు లక్ష్మీదేవి కళతో విరాజిల్లదా. తాను నాలుగు ఐదు సంవత్సరాల వయసులోనే తల్లికి సహాయం చేస్తూ ఎంత ముద్దుగా ఉంటుంది మగ పిల్లవాడికి ఆ సొగసు వస్తుందా చదువులలో కూడా సరస్వతి దేవిల ప్రతి అక్షరాన్ని అర్థంతో సహా జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఉన్నత పాఠశాలలో చూసినా కళాశాలలో చూసినా చివరకు పీహెచ్డీ చేస్తున్నా వారిలో కూడా చూసినట్లయితే ఆడపిల్లకు వచ్చినన్ని మార్కులు మగ పిల్లవాడికి రావు. బాల అంటేనే చిన్నయ సూరి చెప్పినా అర్థం ధారణ, సాధన కలిగిన పాప అని ప్రత్యక్షంగా మన పిల్లల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. తల్లి కూడా ఎంత పక్షపాతం చూపిస్తుంది అంటే ఇంట్లో వారు భోజనం చేసేటప్పుడు కొడుకు కూతురు తిన్న తరువాత కంచాలను కడిగే పని ఆ బంగారు తల్లికి అప్పచెపుతుంది కానీ కొడుకుకు చెప్పదు. వాడు తన ఇంట్లో శాశ్వతంగా ఉండేవాడు చివరి రోజుల్లో మనల్ని కాచి రక్షించేవాడు అన్న అభిప్రాయం. ఆడపిల్ల అనగానే ఆడకు అంటే అత్తవారింటికి వెళ్లే పిల్లని అర్థం కనుక అసలు స్త్రీ అన్న శబ్దానికి అమ్మ అన్న శబ్దానికి అర్థం తెలుసునా వీరికి అ.మ.మ.అ అన్న అక్షరాలు కలిస్తే అమ్మ అకారానికి అర్థం జన్మకు కారణం మామ అంటే అహం బ్రహ్మాస్మి అణువు దానిని సృష్టించినది అమ్మ అందుకే మన తెలుగు వారందరూ రేణుకాదేవి నీ దేవతగా చూస్తారు కనీసం స్త్రీ అనే శబ్దానికి స.ర.త.ఈ అక్షరాలు స అంటే సా, ర అంటే రాజసం, త అంటే తామసం. ఈ మూడు లక్షణాలను సమపాళ్లలో కలిపి తన గర్భంలో ఉన్న శిశువుని ఈ భూమి మీదకు పంపే ప్రయత్నాన్ని ఈ అంటాం. ఈ అంటే ఏడుపు అని కాదు ప్రయత్నం అని శబ్దార్థం. అది తెలిస్తే ఆమెను దేవతా స్వరూపంగా కొలవరా ప్రత్యక్షంగా కనిపించే వ్యవహారాన్ని కూడా విమర్శించే కుసంస్కారం కలిగిన వారికి ఎన్ని హిత వచనాలు పలికినా వ్యర్థమే.
శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే మగవాడి కన్నా స్త్రీకి నాలుగు రెట్లు జ్ఞానం ఉంటుంది అది పుట్టుకతో తనకు వచ్చే వరం. ఆ జ్ఞాన సముపార్జనలో మగవారు ఎందుకు పనికిరారు అన్న దృష్టి కలిగేలా సైకిల్ నుంచి విమానం నడిపే అంతవరకు ప్రతి దానిలో సాంకేతిక పరిజ్ఞానం పొంది మగవాడిని మించి పని చేస్తున్నది స్త్రీ. ఇవాళ చంద్రలోకంలోకి వెళ్లే ధైర్యసహసాలు ప్రదర్శించినది ఆడది కాదా? ప్రపంచ దేశాలనే పరిపాలించినది, ప్రస్తుతం మనకు తెలిసి ఇందిరాగాంధీ శ్రీలంక ప్రెసిడెంట్ బండారు నాయకే లాంటి వారు ఎంతమంది లేరు ఇంతకుముందే కన్న బిడ్డను వీపున తగిలించుకొని వైరి రాజుల పీచమనచిణ ఝాన్సీ లక్ష్మీబాయి ఆడది కాకుండా పోతుందా? మహామంత్రిగా ప్రపంచంలో తనను మించిన మరొక గొప్ప వ్యక్తి లేడు అని ప్రగల్భాలు పలికిన బ్రహ్మ నాయడు గారిని ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన నాయకురాలు నాగమ్మ మగవాడిని మించిన మగవాడు కాదా (పలనాడును పరిపాలించిన నాయకురాలు నాగమ్మ) ఈనాటికీ జ్ఞాపకం వుంచుకో వలసిన స్త్రీ రత్నం కదా.నటనా రంగంలో తీసుకున్నట్లయితే కొన్ని కుటుంబాలు ఆడపిల్లలు చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వాడి వరకు ముసలితనంలో కూడా రంగస్థలం మీదే ప్రాణాల్ని వదిలిన వారు ఎంతమంది లేరు సినీ రంగంలో నడిగర తిలకం సావిత్రి ఆమెకే ఆదర్శమైన జీ. వరలక్ష్మి లాంటి వారి నటనా వైదుష్యం ముందు చివరకు ఎస్వీ రంగారావు గారు కూడా ఎంతో జాగ్రత్తగా నటించవలసిన అవసరం వచ్చినవాడు అంతకుముందు కన్నాంబ గారు, కాంచనమాల గారు ఎన్ని గొప్ప పాత్రలను పోషించారు వారందరూ స్త్రీ జాతి కాదా పరాయి పాలనలోమగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తమ ఆస్తిపాస్తులు అనేక మంది ప్రాణాలను కూడా త్యాగం చేసిన వీరనారీమణులు ఎంతమంది లేరు. ఎంతమంది చెరసాలలో మగ్గి స్వాతంత్ర్య దీక్షతో అశువులు బాసిన వాడు కూడా ఉన్నారు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే త్యాగానికి మారుపేరు అమ్మ అని మర్చిపోతే వారిని అనడానికి భాషలో ఏ మాట చాలదు. రచనా వ్యాసంగాన్నే తీసుకున్నట్లయితే సరోజినీ నాయుడు గారు జాతిపిత మహాత్మా గాంధీని ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం అనేక సూచనలను చేసినది అద్భుతమైన తన కవితల ద్వారా రచనలతో ప్రజలలో దేశభక్తిని పెంపొందించినది ఆమెను స్త్రీగా పరిగణించరా? ఇవాళ సాహిత్యంలో ఇచ్చే బహుమతులలో ప్రథమం, జ్ఞానపీఠ బహుమతి దానిని పొందిన మహిళ లేదా? తమ రచనల ద్వారా జీవితం ఏమిటో సామాన్య మానవునికి కూడా తెలియజేసిన కవయిత్రులు రచయిత్రులు మనకు కనిపించరా? చివరకు రాతిని కూడా నాతిగా చక్కగా అతి నైపుణ్యంతో చెక్కిన స్త్రీలు ఉన్నారని తెలిసి వారికి పాదాభివందనం చేసి తీరవలసినదే. పచ్చి నిజాన్ని చెప్పవలసి వస్తే ఈ ప్రపంచానికి స్త్రీ ఉన్నంత అవసరం పురుషోనికి లేదు ఇంటిని అలంకరించాలంటే ఆమె కావాలి నీవు సంపాదించే డబ్బును సక్రమంగా వాడాలంటే ఆడదే కావాలి నీ మనసు చీకాకుల్లో ఉన్నప్పుడు నీకు చక్కటి కార్యాచరణకు తోడ్పడే వ్యక్తి భార్య కాదా ఆమెను ఆడది కాదనగలవా పిల్లలను తీర్చిదిద్దటంలో ఆమెను మించిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అందుకే ఉపనిషత్తులలో కూడా భగవత్ స్వరూపాలగా చెబుతూ స్త్రీకి ప్రథమ స్థానం ఇచ్చారు. ఆ తరువాతనే పురుషుని స్థానం. చివరిలో వీరందరికీ అక్షర జ్ఞానం నేర్పి సంస్కారాన్ని ఇచ్చిన గురువు గారి పేరు చెబుతూ ఉంటారు. ఆ చెప్పిన మహానుభావులు ఆమె ప్రజ్ఞా పాటవాలు తెలియక అలా ప్రథమ స్థానంలో ఉంచారు అని చెప్పే ధైర్యం నీకుందా? ఆమెను ఏ అంశంలో తీసివేయగలవు నిజానికి ఆమె అవసరం నీకు ఉంటుంది కానీ నీ అవసరం ఆమెకు లేదు అన్నది జగమెరిగిన సత్యం.దానిని మర్చిపోయి ఇంటి పనులు చేసే దాసిలా పిల్లలను సాకే దాదిగా చూడడం ఎంతవరకు సమంజసం. ప్రపంచాన్ని ఆదర్శప్రాయంగా మంచి బాలుడు అంటే ధర్మాన్ని నిర్వహించిన వ్యక్తి అంటే రాముని పేరు చెబుతారు మరి ఆ రాములకు జన్మనిచ్చి అతనిని తీర్చిదిద్ది పూర్తి వ్యక్తిగా మలచినది ఎవరు దశరథ మహారాజా లేక దాసదాసీలా లేక తల్లి కౌసల్య నిజంగా మగవాడిని చెడగొట్టాలనుకుంటే రాక్షస మనస్తత్వంతో తనకున్న కసిని బిడ్డ ద్వారా తీర్చుకోవాలని తల్లి భావించినట్లయితే రావణాసురుని పెంచినట్టుగా పెంచేది పోనీ ఆప్యాయతలు పంచడంలో అమ్మను మించిన వారు మరొకరు ఉన్నారా ఆడపిల్ల బయటకు వెళ్లినా తన పుట్టింటి వారికి ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం చివరకు తలనొప్పి వచ్చిన భరించక క్షణాల మీద వచ్చివారికి సఫారీలు చేసే వ్యక్తి కూతురు కాదా పక్కనే ఉన్న కొడుకు నిన్ను పట్టించుకుంటాడా. పున్నామ నరకాత్రాయత ఇతిపుత్ర అనే ఉపనిషత్తు వాక్యం పున్నామ నరకాలనుంచి రక్షిస్తాడు కనుక వాడిని పుత్రుడు అంటారు నిజానికి ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తున్న విషయం తల్లిదండ్రులను పున్నామ నరకానికి పంపించేవాడు మాత్రమే పుత్రుడు. ఆస్తి తగాదాలు కానీ, పెట్టు పోతలు కానీ ఆడపిల్లకు కనీసం చీర పెట్టినా భరించ లేని మనస్తత్వం కలిగిన వాడు తల్లిదండ్రులు వృద్ధులైన తరువాత వృద్ధాశ్రమాలకు పంపించకుండా ఉండగలడా ఆ ధైర్యం తల్లిదండ్రులకు ఉందా. ఉంటే దేశంలో ఇన్ని కొత్త ఆశ్రమాలు ఎలా వస్తున్నాయి. నీకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన తక్షణం నీ ముందు వాలి నీ సుఖాన్ని చూసేది ఆడపిల్ల తప్ప మగ పిల్లవాడు కాదు అన్న లెక్కల తెలిసి వచ్చినప్పుడు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న మీమాంస మీ మనసుకు రాదు అది సత్యం.క్రీడా రంగానికి తీసుకున్నట్లయితే ఏ ఒక్క ఆడపిల్లలకి ప్రపంచ చరిత్రలోనే భారత దేశ పటాన్ని నడిపిన మన క్రీడా కారిణిలు తక్కువ వారా పురుషుల కన్నా ఎక్కువ శ్రమించి అన్ని ఆటలలోను తామే ప్రథమం అని రుజువు చేసిన వారు సంగీతంలో ఒక్క గానంలోనే కాకుండా, వాద్య బృందానికి కావలసిన ప్రతి వాద్యాన్ని తంబురా నుంచి మృదంగం వరకు ప్రతి అంశాల్లోనూ నిష్ణాతులైన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి శ్రీరంగం గోపాలపట్నం వి బి కనకదుర్గ లాంటి వారి వరకు ఎన్ని కోట్ల మందిని రంజింప చేశారు. నాట్యంలో ఆనాటి పద్మిని, లలితా, రాగిణి నుంచి ఈనాటి రత్న పాప వరకు దేశ విదేశాలలో మన నాట్య శాస్త్రంలో ఉన్న అన్ని పద్ధతులను ప్రదర్శించే దేశ ప్రతిష్టను ఇనుమడించినవారు ఆడవారు కాదా. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆడపిల్లలు వదిలిన అంశం ఈ ప్రపంచంలో ఏది లేదు అని చెప్పవచ్చు. దానిలోను వారికి మించిన వారు వారే తప్ప పురుషులు కారని రుజువు చేసింది కూడా వారే అది జ్ఞాపకం చేసుకుంటే చాలు.
ఝాన్సీ లక్ష్మీబాయి నాయకురాలు, నాగమ్మ పాత్రలను చాలా శక్తివంతంగా మలిచి సినిమాలను కూడా ప్రదర్శించారు. అటు పల్నాడు నాగమ్మగారు భానుమతి గారు నిజమైన నాగమ్మ గారిని మైమరపించారు.

కృతజ్ఞుడైన అలాగే హిందీలో చాట్ చేయడం పాత్ర అద్భుతంగా అద్భుతంగా చిత్రీకరణ ఈనాడు యువతి ఓ అడుగు ముందుకు వేసి కరాటే లాంటి విద్యలు నేర్చుకొని స్వీయ రక్షణ కోసం చక్కని ప్రజ్ఞను చూపించి, చివరకు కుస్తీ పోటీలలో కూడా తమ చావ చూపిస్తూ వస్తాదుగా, పహిల్వాన్ గా మంచి పేరు సంపాదించిన వారు ఉన్నారు స్త్రీలకు కూడా విద్యావసరమని మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా ప్రారంభించింది స్త్రీ కాదా. అలా ప్రతి అంశంలోనూ తమ భాగస్వామ్యం తీసుకున్నది స్త్రీ తప్ప పురుషులు కాదని గమనిస్తే ప్రస్తుతం ఉన్న ఈ తారతమ్యాలు పోతాయని నా విశ్వాసం.

 

Written by Arunanand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వృత్తి అంశాలే ఇతివృత్తాలుగా … డాక్టర్ పర్చా అంజనీ దేవి.

ఓ మహిళ