కొత్త ఉత్సాహం తో కలాలకు వరాలందించే!
బలం జవంతో అలరించే!
కొండంత అండనిచ్చే
పల్లి నుంచి పట్నందాకా ఉన్న
పడతుల ఆదరించే
విశ్వవిపంచిపై వినిపించే
ఆన్లైన్ లో అటెన్షన్ లో అతివలందరూ తహతహతో ఎదురుచూసే
తరుణి పాలిటి వరంగామారే
నీహారిణి!!
కవయిత్రి సంపాదకురాలిగా
మహిళామణుల ఒకటిగా చేర్చి
వినోద విజ్ఞాన వికాస ఉల్లాసాలతో అచ్చట్లు ముచ్చట్లు
బాలగా బేలగా వచ్చి
చిన్నారి పాపగా బుడిబుడి
నడకలతో అలరించు
తరుణిగా ఎదిగి అమ్మగా
అమ్మమ్మ ముత్తవ్వగా
చిరకాలం చిరంజీవి!
ఆన్లైన్ లో అపురూపం
విశ్వమంతా వ్యాపించెనహో!
షడ్రుచుల సమాహారం
జయజయహో తరుణీ
కొండపల్లి నీహారిణి!