మహిళా హక్కుల ఉద్యమకారిణి ఇలా భట్

నెల్లుట్ల ఇంద్రాణి

ఆమెను చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపించే స్వరూపం!
అంతకుమించి ఆమె నాలెడ్జి ఆమె సేవ భావం ఎన్నో కలిపి ఇలా భట్ అయ్యారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంద్ర గాంధీ శాంతి బహుమతి రైట్ లైవ్ లీవ్ ఫుడ్ అవార్డు గ్రహీత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా భట్ గారు అహ్మదాబాద్ లో 1933 సెప్టెంబర్ 7వ తారీఖున జన్మించారు ,నవంబర్ రెండు 2022 సంవత్సరంలో పరమపదించారు.
ఈ తేదీ లు కేవలం పుట్టుక వంటివాటిని గురించి తెలుసుకోవడానికే కాదు . ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి.
ఆమెన్ వృత్తి ప్రకారం లాయర్ కానీ ఆమె ప్రవృత్తి సేవా తత్పరిత గుణమైన ఆమె అన్ని రంగాల్లోనూ తన విశిష్ట సేవలను అందించారు.
రమేష్ భట్ గారు ఆమె జీవిత భాగస్వామి.
ఈమె 1972లో స్వయం ఉపాధి మహిళల సంఘం స్థాపించారు దాని ద్వారా వినలేని సేవలను అందించారు 1972 నుంచి 1996 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.


ఆమె తల్లి వనలీల వ్యాస్ తండ్రి సుమంత్రాయ్ దంపతులు.
సుమంత్రాయి భట్ న్యాయవాది వృత్తిని స్వీకరించారు . ఆమె ద్వారా ప్రేరేపితులై లాయర్ గా పేరు పొందారు .
సంస్కారం , మంచితనం పుణికిపుచ్చుకున్న ఇలా
తల్లి నుండి సామాజిక సేవ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు.
కమలాదేవి చటోపాధ్యాయ స్థాపించిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్కు కార్యదర్శిగా కూడా పనిచేశారు.
అహ్మదాబాద్ లోని సర్ లా కాలేజ్ నుంచి పట్టభద్రులు అయ్యారు హిందూ చట్టంలో ఆమె చేసిన కృషికి గోల్డ్ మెడల్ తో సత్కరించబడ్డారు.
1955లో మహాత్మా గాంధీ నేతృత్వంలోని టెక్స్టైల్ కార్మికుల సమ్మె నేర్పథ్యంలో 1920లో ఏర్పడిన టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ టెక్స్టైల్ కార్మికుల కోసం భారత పురాతన యూనియన్ లో ఇలా భట్ చేరారు.
మన జాతిపిత నుండి ప్రేరణ పొంది ఆమె 1972లో సేవా ఎస్ ఈ డబ్ల్యూ ఏ స్థాపించారు 1996లో పదవీ విరమణ చేసే వరకు యూనియన్ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు ఆమె నాయకత్వంలో శివ సంస్థ 1976లో పేద మహిళలకు వారి సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి చిన్న రుణాలను అందించి ఒక సహకార బ్యాంకును స్థాపించింది యూనియన్ ఆర్థిక మండలి మరియు వ్యాపార సలహాలను కూడా అందించింది.

ఇలా పేద మహిళల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. ఇంతటి విశిష్ట మహిళా మణిని ఇలా భట్ ను గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ఆమె ను గురించి తెలుసుకున్నాం. మునుముందు మరెందరో ఇలాంటి గొప్ప మహిళల గురించి కూడా తెలుసుకుందాం.

Written by Nellutla Indrani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చదువుల చెట్టు

తరుణీయం