మన మహిళామణులు

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవయిత్రి శ్రీమతి యనమదల శ్రీదేవి

శ్రీదేవి

ఆమె ఎలమంచిలి లో kaza గ్రామం లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.సబ్జక్ట్ కార్నర్ ఏర్పాటు చేసి పనికిరాని వస్తువులతో బోధనోపకరణాలు
తను చేస్తూ పిల్లలచేత చేయిస్తారు.అలా ఆటపాటలతో అలరిస్తూ ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.
వాడి పారేసిన వస్తువులతో కాలచక్రం తాజ్మహల్ గుణింతబోధిని తయారు చేశారు.జిల్లా మండలస్థాయి లో గెల్చుకున్న బహు మతులకు లెక్కేలేదు.డబ్బాలపైమూతల పై నెల వారం తేదీ రాసి కింద స్టాండ్ ఏర్పాటు చేశారు.చక్రంలా మూతను తిప్పితే దాని పై ఉన్న ముల్లు తేదీలు సూచిస్తుంది.గుణింతబోధిని తో పిల్లలు చక్కగా తప్పు లు లేకుండా రాయగలరు.ఖాళీ అగ్గిపెట్టెలపై ఒక అక్షరం రాసి లోపలగుల్లపై ఒత్తిడులను    రాశారు.విద్యార్ధులు తేలికగా గుర్తు పడతారు.

టి.వి.మోడల్అట్టపెట్టెలో దేశ నాయకుల బొమ్మలు పెట్టిబైట చక్రం తిప్పితే బొమ్మలు రావడం విశేషం.పనికిరాని పాతపలకలపై పెయింటింగ్ వేసి మానవశరీరభాగాలు ఇంకా ఇతరమైనవి 150కిపైగా చేశారు.ప్లాస్టిక్ గ్లాసులపై అంకెలు కూడితే వచ్చే అంకెల మొత్తం రాశారు.అలాగే ఎక్కాలు కూడా గ్లాస్ పై గ్లాస్ పెట్టిన జరిపితే ఎక్కాలు వస్తాయి.ప్లాస్టిక్ గిన్నెలు థర్మాకోల్ తో తాజ్మహల్ ..ఇలా క్లాస్ అంటే సైన్స్ లాబ్ అనిపిస్తుంది.ప్రతిసబ్జక్ట్ కి ఒక స్టాల్ తో ఏర్పాటు చేసిన ఎక్జిబిషన్ 2017లో ఎంతోమంది ప్రశంసలు పొందింది.పనికిరాని సీడీలు ముందు ఖాళీ సీసాలు ఇలా ఎన్నో ఆమె చేసి చార్ట్ లతో సహా పాఠాలు చెప్పడం ఓప్రత్యేకత!
ఇంకా దేశభక్తి గీతాలకు అనుగుణంగా డాన్స్ నేర్పడం తో పిల్లలు త్వరగా గేయాలు నేర్చుకుంటారు.పద్యాలు కూడా వస్తాయి.ఇక శ్రీదేవిగారి మాటల్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.”
“నాపేరు శ్రీదేవి.నేను ఎం.ఎఇంగ్లీష్ ఎం.ఎ.ఎడ్యుకేషన్ చేశాను.బి.ఎస్సీ చదివాను.మెడిసిన్ లో సీట్ వచ్చినా మానాన్న గారి హఠాత్ మరణంతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరలేకపోయాను ఇంకా అధ్యాపకురాలిగా ఉపాధ్యాయ వాణి అనే పత్రికకు రాస్తుంటాను.నాకు తోచిన విధంగా అటెండెన్స్ నిబట్టిపిల్లలకు ఆర్ధిక సాయం స్కాలర్షిప్ ఇస్తాను.అలా బడికి రెగ్యులర్ గా వచ్చేలా చూస్తున్నాను.
సన్మానాలు,అవార్డులు:                                                                                                                          ఉత్తమ ఉపాధ్యాయిని గా ఎలమంచిలి మండల స్థాయి అవార్డు2008లో,
జిల్లాస్థాయి అవార్డు2010 లో,
గురు బ్రహ్మ అవార్డు,రాష్ట్ర స్థాయిలో2011లో
ఉత్తమ రచయిత్రి గా శ్రీ విజ్ఞాన వేదిక , భీమవరం వారిచే, గజల్ చారిటబుల్ ట్రస్టు వారిచే ఉత్తమ ఉపాధ్యాయిని గా సన్మానం
సావిత్రీ బాయి పులే జాతీయ అవార్డు, సాంస్కృతి సమైఖ్య,అమరావతి వారిచే,ఆదిత్య కళాశాల వారిచే ఘన సన్మానం.
మనం ఫౌండేషన్ కడప వారిచే ఉత్తమ ఉపాధ్యాయిని గా జాతీయ స్థాయి అవార్డు
మా పితామహులు లేటు Y.సత్యనారాయణ మూర్తిగారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్,మా అమ్మ గారు శ్రీమతి సరస్వతి ,రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్, విశాఖ పట్నం.
భర్త:రావూరి జవహర్లాల్ నెహ్రూ, సీనియర్ అడ్వకేట్,
పిల్లలు:అభిషేక్,అభిజిత్ , ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నారు.
నేను M.A.English,M.A Education చేసి ఉపాధ్యాయురాలిగా పని చేయుచున్నాను.
హాబీలు:కవితలు వ్రాయడం,విద్యార్థులకు ఉపయుక్తమైన బోధనాభ్యాసన సామగ్రి తయారు చేయడం,వైజ్ఞానిక వ్యాసాలు రాయడం.
పై అంశాలలో సృజనాత్మక ఆలోచనలను రేకెత్తగల పరిశోధన చేయుచున్నాను.


సం ఘ సేవ:
రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ,పాటశాలలో హాజరు ప్రోత్సహించే విధమైన స్కాలర్ షిప్ అందించుట,పిల్లలకు వసతులు ఏర్పాటు,గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం.
జాతీయ సమైక్యతా శిబిరాల్లో పాల్గొని స్ర్తీల సమస్యలు, అవగాహన పై ఉపన్యాసాలు ఇవ్వడం
సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలలో ఉత్సాహం గా పాల్గొనడం,సమకాలీన సమస్యల పై కవితలు రాసి సమాజాన్ని అప్రమత్తం చేయడం.
సంఘ/సాహిత్య అభిలాష:
వృత్తి రీత్యా గ్రామీణ ప్రాంతాలలో పని చేయుచున్న నాకు వారి లో అవిద్య,మూఢాచారాలు,కులమత భేదాలు,వర్గ వై షమ్యాలు,స్త్రీల పై హింస కలచి వేశాయి.నా వంతుగా చేతనైనది చేయాలని అనుకున్నాను
నా ప్రచురణలు:ఉపాధ్యాయ వాణిలో వైజ్ఞానిక వ్యాసాలు,సాక్షిలో ఉగాది కవిత, సాహితీ గోదావరిపత్రికలో 4కవితలు,పున్నమి పత్రికలో6పైగా కవితలు,సాహితీ కిరణం లో గాంధీజీ సిద్ధాంతాలు,ప్రపంచ తెలుగు సభల సావనీర్ లో ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్ కవిత అచ్చయ్యాయి.
పుస్తకం:జై సమైక్యాంధ్ర ..జై జై సమైక్యాంధ్ర..
(చలసాని శ్రీనివాస్ గారిచే ఆవిష్కరణ)
9989710800
ఊరు:పాలకొల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“కొత్త ఆశ “

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : మాలతితీచందూర్.