“సూరీ …ఏంటి నువ్వు చేసిన పని ,తాగుబోతు తో పెళ్లి వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నా ప్రేమ గొప్పది అతని వ్యసనాలను వదిలిస్తాను అని అన్నావు ,వాడు ఏమీ మారలేదు .
నువ్వు కష్టపడటం తప్పలేదు ,ఇద్దరు పిల్లలతో నానా అవస్థలు పడుతున్నావు .సినిమాల్లో చూపించే అంత బాగోదు ప్రేమ ,పెళ్లి ,ప్రేమ గుడ్డిది అని మన పెద్దలు వూరికే,అనలేదు .
“వాడితో వేగలేక ఆత్మహత్యకు ప్రయత్నించావని తెలిసింది అది చాలా తప్పు , అన్నీ కోల్పో యినా ఒక్కటి మిగిలే ఉంటుంది అదే భవిష్యత్తు మీద ఆశ .”
” దేవుడు ఊరికే మనల్ని పుట్టించ లేదు మన వల్ల ఏదో కావాల్సి ఉంటుంది అది పూర్తి చేయకుండా అర్థాంతరంగా జీవితాన్ని ముగించకూడదు ,
నన్ను వదిలి అంకుల్ వెళ్ళిపోయినా ! నేను ఎందుకు ఒంటరిగా బ్రతుకుతున్నాను , భగవంతుని పిలుపు వచ్చేదాకా మన బాధ్యత నిర్వర్తించాలి, ఆయన వెళ్లిపోయారని నేను బాధపడుతుంటే కలిసి పుట్టారా? కలిసి పోవటానికి ,అన్నారు స్వామీజీ .
నీ ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, తల్లి లాంటి దానిని నీ మేలు కోరి చెబుతున్నా ,”అన్నాను ఆమె కంటి నీరు తుడుస్తూ . మీ ఆయన్ని డీ ఎడిక్షన్ దాంట్లో జాయిన్ చేద్దాం తప్పక మార్పు వస్తుంది ,”అన్నాను .
సూరి మోము లో కొత్త ఆశ కనపడింది.