శ్రీమతి కామేశ్వరి ఆత్రేయ గారు కలకత్తాలో ఓస్కూల్ ప్రిన్సిపాల్ గా చేసి రిటైరైనారు.వంటలు చేయటంలో సిద్ధహస్తులు.తన సమయాన్ని బీద పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పుతూ గడిపారు.అవసరమైనవారికి ఫీజులు కట్టేవారు.హైదరాబాద్ లో సెటిల్ అయినాక ఆధ్యాత్మిక రచనలు చేస్తూ మిగిలిన బట్టముక్కలతో లంగా ప్రాకు హాండ్ బ్యాగ్స్ కుట్టి ఉంచి గిఫ్ట్ గా ఇస్తారు.పాడైన చీరలతో సోఫా దిండుగలీబులు ఆప్లికో వర్క్ బెడ్ షీట్లు రెడీ మేడ్ కన్నా మిన్నగా కుట్టారు.రోజూ ఓ అరగంట మిషన్ పై సృజనాత్మకత సృష్టిస్తారు.ఇక చేతితో కుట్టిన ఎంబ్రాయిడరీ చూడండి.పెయింటింగ్ అని పించటంలేదూ? గుడిలో భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణ కి వెళ్తారు.రేడియో ప్రోగ్రాంలు కూడా ఇచ్చారు.టైం సద్వినియోగం ఆర్ట్ క్రాఫ్ట్ తో తరుణులు బోర్ అనకుండా ఎలా గడపవచ్చో ఈమెని చూసి నేర్చుకో వచ్చు.మంచి స్నేహశీలి.