తరుణి చిత్రం

ప్రథమ పౌరురాలికి స్వాగతం !

శీతాకాల విడిదికి తెలంగాణ విచ్చేయనున్న గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారికీ హృదయ పూర్వక స్వాగతం !

(ముర్ము గారిని రాష్ట్రపతి గా ప్రకటించిన సందర్భమప్పుడు వేశాను పై చిత్రాన్ని) -రూప 26.12.22

వెలుగు నీ రూపం
నీడ రూపం
నీ రూపం అస్తిత్వకేతనం
నీ రూపం జాతిజయ సంకేతనం

ద్రౌపది ముర్ము ఒక పేరే కాదు
ఇప్పుడు ఒక శక్తి
తీవే నీవే పాదూ నీవే
పాలు నీళ్లు మర్మం నీవే

ప్రాణం దేహం
పదం అర్థం
గానం రాగం
నీ గుప్పిట అధికారం
నీ ఆలోచన జ్ఞాన విశేషం
శీతాకాల సమీరం
శాంతి సౌభ్రాతృత్వ సాధనం
నీ అడుగుల ప్రతిధ్వనులు

చిత్రకారిణి : రూప

ప్రథమ పౌరురాలి హోదా నీది
ప్రపంచ దేశాలు పొగిడే స్థానం నీది
నిలిచి గెలిచే రాష్ట్ర ప్రతివి నీవు
భావాంబరంలో మేమంతా
స్వేచ్ఛగా ఎగిరే కోయిలలం!

కవితా రచన డా. కొండపల్లి నీహారిణి

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి బాలచిత్రం

నాకు కావాలిసింది ఇది కాదు.