ధర్మం చర

కామేశ్వరి

నేను నా ఫ్రండు అలా నడిచి మార్కెట్టుకు వెడుతున్నం. అక్కడ మాకు “ధర్మం చర” అనే బోర్డు కనిపించింది.

అది చూసి మా ఫ్రండు లత “ధర్మం ధర్మం అంటారుగాని ఆ దారిలో నడిస్తే జీవితాన్ని ఎలా నెట్టుకొస్తామండి, ధర్మాలు ఇతరులకు చెప్పడం సులభమేకాని ఆచరణకు అస్సలు కుదరదు అంది లత.

దానికి నేను ‘ధర్మం చర’ అనేది సనాతనమైన ఒక జీవిత సూత్రం. మనం ఇపుడు పురాతనానికి, ఆధునికానికి మధ్య కాలంలో ఉండబట్టి దాని అర్థం నీకు బోధపడటం లేదు. ధర్మం అంటే పురాణాలతో చెప్పే ధర్మాలు రాగు, మానవుడు సుఖంతో ఏలా మసులుకోవాలో చెప్పెవే. మనలను మనం సరిచేసుకోవడం. అందువలన జీవన యానం సుగమం అవుతుంది. వడిదుడుకులు వచ్చినా విశ్లేషించుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ భూమి మీద ఉన్న జీవరాసులేవి ధర్మం తప్పటం లేదు. కోడి తెల్లవారు జామున కూయటం, వసంతంలో కోయలు కూయడం, ఏ కాలంలో ఆ రుతువులు సరిగా ధర్మం పాటించడం వలననే భూమి మీద మనుగడ సాగుతోంది. వైజ్ఞానికంగా ఎదిగాంగాని, మానవత్వంలో దిగజారుతున్నాము.  రాష్ర్టాలైనా, దేశాలైనా, భాషలు వేరైనా ఎవరి సాంప్రదాయ ధర్మాలు వారికి ఉన్నాయి. వాటిలో మన వేలు పెట్టవలసిన అవసరం ఏమిటి? మనిషిని మనిషిగా చూడు. ప్రకృతి నీకిచ్చిన ధర్మంలో బ్రతకటం నేర్చుకో. భావితరాలవారికి నేర్పు. తప్పుదారిపట్టకుండా వుంటారు. ఈ న్యూక్లియర్ వాదులు, టెర్రరిజాలు, బయోవార్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి ధర్మంలో వారిని బతకనీయక పోవటమే. ఆదిపత్యపోరు. ఇక మతాలు విషయానికొస్తే వారి వారి కట్టుబాట్లు (ధర్మాలు) వున్నాయి. ఇప్పటి జనరేషను అంతా విద్యవంతులే. వారు మొక్కగా ఉన్నప్పుడే అన్ని విడమరచి చెపితే ధర్మం అదే వర్థిల్లుతుంది.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రవికిరణాలు

సరళోక్తి