ఉదయ భానుని తొలి కిరణాలు
ఊరె కొమ్మల పైబడి విరిబాలను నిద్రలేక తన
పరిమళాలు వెదజల్లెదము. కుసుమాంజలిఘటియించె
ఆ రవిబింబమునకు
కాసిన కనురెప్పలను అల్లనల్లన
తెరిచి చూచి ఉదయభానుడు వేంచేసెనని
సృష్టికర్త సృష్టిభర్త ఎదురురాగ
తలవంచి ప్రణమిల్లెను పూబాల చిరునగవున
నీలి నింగి రంగుమారి నునులేత
స్వేత వర్ణమలరె చల్లని రవి కిరణాలు
నును వెచ్చగ మారెనప్పుడు
సంతసించి పూలబాల ప్రణమిల్లెను చిరునగవుల