ప్రతి మనిషి ఎదుటి మనిషికి అద్దమే , చూడొచ్చు తమని తాము ఎదుటివాడి కళ్ళలో, చూడొచ్చు తమ నడవడి పరిణామం సాటివారిలో సాటివారి పురోగమనలో, తాను యోజనాలు ప్రయాణం చేశాడు
తన గమనంలో కదలికలు లెక్కిస్తూ, తన నోసళ్ళు సంధించిన ధనస్సులు, నేత్రాలు ఆస్త్రాలై నడిచే అమ్ములు,
పెది మల చిరునవ్వుల లాస్యాలు ,అవని సంధించిన శరత్తులు, కరచాలనంలో విరిసిన స్నేహం ,
ఆశీస్సులు అందించే అమృత హస్తం, సాటి మనిషి ఉన్నతిని సహించలేని అసహనంతో ప్రతి మనిషి అవినీతిపరుడే అనే అపనమ్మకంతో, ఎదుటివాడి చూపుతో తన నడివడి దిద్దుకోలేక ,
కేవలం సహృదయంతో సమస్యలు పరిష్కరించుకోలేక,
అర్థం లేని నిస్స త్తువతో, అందుకోలేని అందలాల కోసం అంగలారుస్తూ, మనం చేయగలిగిన పనులు కూడా చేయకుండా ,ఎదుటివాడినీ మాటల వలలో ఇరికిస్తూ ,పనిచేస్తున్న వాళ్ళని చులకన చేస్తూ, బ్రతుకుని సోంబేరితనంతో గడుపుతున్న వారిని చూడలేక, చూడక తప్పక స్వార్థం చాటున మాయమైన స్నేహాన్ని వెతుక్కుంటూ, మేధావి అయినా, మానవతావాది అయినా, గాంధారికి గంతలు తప్పలేదు. మర్మ మె రిగిన మనమూ కావాలనే కట్టుకున్నాము గంతులు ,మాన ,ప్రాణ, దహనాలకు, ఆవర్థులైన చీకటి గూ ళ్ళు ఈ రెండు కళ్ళు, ఎందరో గాంధా రులు మన చుట్టూ, ఎన్నటికో పరివర్తన మనుషుల్లో ,మన మనసుల్లో…