బాల తరుణి

చిత్ర కవిత

నీడలో నికుంజం
నమ్మలేని నిజమని
రుజువు లెవరు చెప్పాలి
నైజం అదే వాదమవ్వాలి
పచ్చదనం ప్రశాంతత
పసిమి మిసిమి కాంతులీను
నిలువెత్తు మనీషి గా
నమ్మిక మనిషిదైతే చాలు
తేట తేట గీతి లా
తిన్ననైన గీత లా
లాభ నష్టాలేవీ
నడివీధి సందడవనప్పుడు
నిత్య సుడిగుండ వలయాలు కానప్పుడు
అందం ఆరోగ్యం
ఆనందం అద్వితీయం
గుండె గూటిలో దాచలేని
సమస్త సౌందర్య నందనం               –   డా. కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు.

చిత్రకారిణి : అనన్య దేవల్రాజ్

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రభాత కమలం

కంటి రోగాలు