ఉషోదయం

ఒక సారీ రెండు థ్యాంక్స్ లు

థాంక్స్ సారీ అనే రెండు పదాలు మనం ఇంగ్లీషు వారినుంచి వారసత్వంగా పుచ్చుకున్నామని చెప్తుంటారు. ‘ధన్యవాదాలు’, ‘ క్షమించండి’ అనడం కన్నా నిత్య జీవితంలో ‘థాంక్స్’, ‘సారీ’అనడం ఎంతో సులువు. అయినా

చాలామంది వీటి వాడకంలో ఎంతో పొదుపు చూపిస్తుంటారు. అసలు

‘థాంక్స్’,

‘సారీ’ అనే రెండు పదాలు ఎంతశక్తివంతమైనవో ఎంతోమందికి తెలీదు. అంతేకాదు | మానవ సంబంధాలను మెరుగుపర్చడంలో ఈరెండు పదాలు ఎంతగా దోహద పడతాయో చాలామంది గ్రహించరు. జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం ఇతరులనుంచి ఎన్నో సహాయాలు పొందడం, ఎంతో మంది మనసును నొప్పించడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో ఈ ‘థాంక్స్’, ‘సారీ’ అన్న రెండు అక్షరాల పదాలు ఉపయోగించడం వల్ల వారితో సంబంధబాంధవ్యాలు మరింత బలపడే అవకాశం ఉంది. కానీ చాలామందికి అలా చెప్పడానికి అహం అడ్డు వస్తుంది. ఆ మాత్రం దానికి ‘థాంక్స్’, ఈ మాత్రం దానికి ‘సారీ’ ఎందుకు చెప్పాలి అనుకుంటారు. ముఖ్యంగా చాలామంది తమకంటే చిన్నవాళ్లకు,అంటే పిల్లలకు, భార్యకు ‘థాంక్స్’, గానీ ‘సారీ’ గానీ చెప్పడానికి సంకోచిస్తుంటారు. వీరికి మనం సారీ చెప్తే తాము చులకన అయిపోతామేమోననే భయం వారికి ఉంటుంది.

ఉదాహరణకు ఏదో క్షణికావేశంలో తమని తాము నిగ్రహించుకోలేక పిల్లలపై చేయి చేసుకున్నారనుకోండి, ఆ ఆవేశం చల్లారాకా వారికే అనిపిస్తుంది, “ఛ ఛ ఎంతటి పనిచేసాను. ఈ మాత్రం తప్పిదానికి అంతగా కొట్టాలా?” అనే అంతరాత్మ నిలదీస్తుంది. అయినా కొంతమంది తల్లిదండ్రులకు సారీ చెప్పడానికి అహం అడ్డువస్తుంది. కానీ ఇలాంటప్పుడే మనం అహాన్ని తీసి పక్కన పెట్టి, పిల్లలను దగ్గర తీసుకుని తాము చేసింది తప్పు అని ‘సారీ’ చెప్తే గాయ హృదయాలు ఎంతో సంతోషిస్తాయి. అందువల్ల తల్లిదండ్రులతో వారి సంబంధం బాంధవ్యాలు దెబ్బతినవు. ఈ విషయం ప్రతి తల్లిదండ్రీ గుర్తించుకోవలసిందే. ఇలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు తలయెత్తినప్పుడు ఆవేశంలో మాట మాట అనుకోవడం సర్వసాధారణం. కాని ఆవేశం తగ్గాక ఆ ఇరువురిలో ఎవరి సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. తప్పో వారు వచ్చి ఆ రెండో వారికి మనస్ఫూర్తిగా “సారీ” చెప్పడం వల్ల ఎన్నోఅలా చేయని పక్షంలో చిలికి చిలికి గాలివానగా మారి పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకే సారీ చెప్పడం వల్ల తాము చులకనయి పోతామేమోనన్న అపోహను ప్రతివారూ తమ మనస్సులో నుంచి తుడిచేయాలి. ఇక నిత్యజీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు ఎన్నో చిన్న చిన్న సహాయాలు తీసుకోవడం కూడా మామూలే! అయినా వాటికి స్పందించి అప్పటి కప్పుడు కృతజ్ఞతలు చెప్పము. కానీ అటువంటి చిన్న చిన్న ఫేవర్స్ తీసుకున్న కూడా ఎదుటివారికి థాంక్స్ చెప్పితే వారికి కలిగే సంతృప్తి వర్ణనాతీతం. ఇటువంటి సంజ్ఞలే(గెస్చర్స్) భార్యాభర్తల మధ్య బంధం మరింత పటిష్టం కావడానికి ఎంతో దోహపదపడతాయి. అలాగే అత్తాకోడళ్లు, మామా అల్లుడు, వదినా మరదళ్లు, వీరి మధ్య బంధాలు మెరుగుపడాలంటే పైన చెప్పినవన్నీ పాటించాలి. మరొక్క ముఖ్య విషయం పెద్దలు ఈవిధంగా సందర్భానుసారం ‘థాంక్స్’, ‘సారీ’ చెప్పడం. అలవర్చుకోకపోతే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులాగే తయారు అవుతారు. ఫలితంగా వారు ఎంతో మంది తమ స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను కోల్పోయే ప్రమాదం ఉంది. సో.. పిల్లలు, మంచి నడవడిక గల పౌరులుగా ఎదగాలంటే పెద్దలు పైన చెప్పిన వన్నీ పాటించితీరాలి. అందుకే అన్నారు “ప్రాక్టీస్ బిఫోరియు ప్రీచ్”. అని ఏమంటారు!

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

చదువు – సంస్కారము