తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు…?

          శివల పద్మ

ఇది మన సనాతన ధర్మం చెబుతున్నది..మనవారు దీన్ని ఎప్పుడో మరిచారు .

వంటచేయడం వడ్డించడం ఒక వరం.. అయితే అది ఇప్పుడు ఒక కళగా మారింది..

వంట ఇల్లు ఒక దేవాలయం..

పొయ్యి వెలిగించడం అంటే అగ్ని హోత్రం వెలిగించడమే.. అది భక్తిగా.. భగవంతుని తలుస్తూ నేను చేయ బోయే పదార్థాలు
మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెబుతారు..

అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసే వారు..
{ నేను గణేశ పంచకం , హనుమాన్ చాలీసా చదువుతాను ఇవి రెండూ చదివే లోపల నా వంట అయిపోతుంది.}

వంట చేసిన వారి మనస్థితి తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు..

దీనికి అమ్మ చెప్పిన ఒక కథ కూడా ఉంది..

ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు..
అతను మహా నిష్టాగరిష్ఠుడు.. అతనింట్లో దేవతార్చన , అతని కుల వృత్తి తప్ప అతనికి
ఏం తెలియదు..

ఒక రోజు ఆ ఊరి జమీందారు గారు
ఈ బ్రాహ్మణుడిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు..

పాపం ఎప్పటి లాగే ఆయన భోజనానికి వెళ్ళారు..

ఏనాడు లేనిది ఆరోజు ఆయనకు తాను భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది..

భోంచేస్తున్నాడన్న మాటే కానీ చూపు గ్లాసు మీదే ఉంది..

చివరకు భోజనం చేయడం పూర్తి అయ్యింది..
చేయికడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్ళి చేయి కడుక్కుని ఆ గ్లాస్ ని తన చేతి సంచీలో వేసుకున్నాడు..

ఆ తరువాత జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు .

కాళ్ళు కడుక్కని లోపలికి వెళ్ళి కూచున్నాక
భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతను స్ప్రుహ లోకి వచ్చాడు..

తాను చేసినది దొంతనం అని తనను ఎవరో ఛెళ్ళున కొట్టినట్టు అయ్యింది..

వెంటనే చేతి సంచీ భుజాన వేసుకుని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమిందారు గారింటికి వెళ్ళాడు..

ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుడిని ఆశ్చర్యంగా చూస్తున్న జమీందరుని చూసి

” అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కరగాయలతో సహా ఎలా సేకరించారు. మీ వంట మనిషేమయినా మారారా? వేరే వంటవారు వచ్చారా?” అని అడిగాడు..

ఆయన భార్యను పిలిచి అడిగాడు .

“అవునండి నెలరోజులయ్యింది “అని చెప్పింది.

“ఆర్యా! ఏం జరిగింది? ” అనడిగిన జమీందారుకు

“అయ్యా! ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేసాను.. నాకు ఎందుకు ఆబుద్ధి పట్టిందో తెలీదు. ఇంటికి వెళ్ళి నాభార్య చేతి మంచి నీరు తాగాక నేను స్ప్రుహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకుని వచ్చాను.. ”

“మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి.. అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రీకరించింది.” అని చెప్పడంతో

వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకుని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేర వేస్తుండడం ఒప్పుకుంది..

వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు.
బ్రాహ్మణుడు తాను దొంగిలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించ మని అనడిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు.

వంట చేసే వారి ప్రభావం వారి మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి..

అతిథి దేవో భవ అన్నారు..

ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రలలో సర్దడం కాదు . నేల మీద అరిటాకులో వడ్డించినా మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం..

అలాగే చాలా మంది ఇంట్లో ఎంగిళ్ళకు ప్రాధాన్యత ఇవ్వరు. తిన్న కంచంలో మిగిలినది కూడా వంటలో కలపడం , తింటున్న కుడిచేత్తో మారు వడ్డించుకోడం..
ఒకరి పళ్ళెంలో నుండి ఒకరు తీసుకుని తినడం ఫ్రిజ్ లో బాటిల్ ని నోటికి కరిచి పెట్టుకుని తాగడం ఇలా చాలా ఉంటాయి..

నేను కళ్ళతో చూసాను..వచ్చే వారు నిష్టాగరిష్టులైతే వారికి ఎంగిలి పెట్టిన పాపం ఊరికే పోదు..

అందుకే నియమంతో ఉండే వారు ఎవరూ వేరే వారి ఇంట్లో వేరేవారి చేతిమీద వీలైనంతవరకు తినకపోవడమే మంచింది..

నేడు రోడ్డు మీద ఎవరు వండినదో తినడం ఎక్కువయ్యింది అందుకే ఇంత గందర గోళం..

అందుకే తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశ పరులవుతున్నారు..అది గమనించగలరు..

తిండి మనల్ని తయారు చేస్తుంది.

Written by Shivala Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

తరుణి చిత్రం