అమ్మాయి పెళ్లి

డాll అరుణ పరంధాములు

పొద్దున్నే నిద్ర లేచాను లేవగానే నాకు అద్దంలో ముఖం చూసుకుని అలవాటు. ఆరోజు పదేపదే చూసుకుంటున్నాను నా ముఖాన్ని…
అబ్బా ఇంత అందహీనంగా ఉన్నానా…
నా ముఖం నాకే చూసుకో బుద్ధి కాలే..
ఆడపిల్లలు ఇలా పుడితే తల్లిదండ్రులు ఏమైపోవాలి అని మనసులో బాధపడ్డా
ఇంత అందహీనమైన ముఖం ఎవరికి ఉండదేమో..! ప్రపంచంలో బహుశా!

నా అందం గురించి నేనే వర్ణించుకుంటాను. గుడ్లగూప్పలాంటి కళ్ళు. ముక్కిడి ముక్కు నల్లని ముఖము ఆ ముఖానికి నల్లని ఉంగరాల జుట్టు అబ్బో!
నా ముఖం చూస్తే నాకే భయమేస్తుంది. నిద్రలో పసిపిల్లలు నా ముఖాన్ని చూస్తే భయపడతారు..
ఇలాంటి అంద హీనమైన ముఖాన్ని చూసుకోవడానికి నాకే అసహ్యంగా ఉంది.
మరి మా అమ్మ నాన్న పరిస్థితి…
మా అమ్మ నాకు ఎలా? పాలిచ్చి పెంచిందో…! పుట్టినప్పుడే నన్ను ఏ నూతిలోని పడేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు ఈ రోజు మా అమ్మ నాన్నకు.
నా ముఖం బాగుండదు కానీ నేను చదువులో ఫస్ట్. ఏ ప్పుడు క్లాస్ లో నేనే లీడర్. మా లెక్కల మాస్టర్ కి నేనంటే ఎంతో ఇష్టం లెక్కలు బాగా చేస్తానని. ఇంటర్మీడియట్ లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ నాదే మా కాలేజ్ వాళ్ళు మా అమ్మ నాన్న ఎంత సంతోషపడ్డారో..

ఇంటర్ అయిపోగానే అమ్మా నాన్నకు టెన్షన్ మొదలైంది ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో అని.. అందం లేదు ఆకారం లేదు.
నాన్న కు మాత్రం బాగా డబ్బుంది.
నా కూతురుని చూసి ఎవరూ పెళ్లి చేసుకోరు కానీ ఇచ్చే కట్నకానుకలు చూసి పెళ్లి చేసుకుంటారని నాన్న ఆశ..
నాకు పెళ్లి సంబందాలు చూడడం మొదలుపెట్టారు
అందరూ వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఇప్పటికీ చాల మందికి చూసారు.
నాకు వాళ్ళు ముందు కూర్చోవాలంటే చిరాకు
నా అంద హీనమైన ముఖాన్ని వాళ్ళు ఎవరు నచ్చరని నాకు తెలుసు. అయినా తప్పడం లేదు. అమ్మానాన్న తృప్తి కోసం కూర్చుంటున్నాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. నేను డిగ్రీ పూర్తి చేశాను అయినా నాకు పెళ్లి కాలేదు.
అమ్మ నాన్నకు ఒకటే దిగులు ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేయాలని ఆశ…

అనుకోకుండా ఒక రోజు పక్కింటి వెంకటమ్మ ఆంటీ మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి చూడటానికి ఏమీ బాగుండదు. అయినా మీ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు మీరు ఒప్పుకుంటే అబ్బాయిని పిలిపిస్తానంది ఆంటీ..
అమ్మకు ఎక్కడ లేని సంతోషం కలిగింది మనసులో..
నా కూతురు కంటే అంద హీనమైన వ్యక్తులు ప్రపంచంలో ఉన్నందుకు..
అమ్మ సంతోషానికి అవధులు లేవు..
నా పెళ్లి అయిపోయినట్టుగానే కలలు కంటుంది.

అమ్మ నన్ను గట్టిగా పిలిచింది లోపలికి రా వాళ్ళు వస్తున్నారనీ
అమ్మ హడావుడిగా లోపలికి వెళ్లి బీరువాలోంచి కొత్త చీర తీసింది ఒకసారి ఇలా రా ఈ రంగులు నువ్వు ఎలా ఉంటావో చూస్తాను అంది అమ్మ.
అమ్మ చీర రంగులతో ముఖానికి అందం వస్తుందా! అయినా రంగులు చూసుకుని చేసుకునేవారు ఎన్నాళ్లుంటారే! ఎందుకమ్మా హడావిడి నేను చదువుకుంటాగా నన్ను చదువనివ్వండమ్మా అన్నాను.

వెంటనే అమ్మ ముఖం చిరాగ్గా పెట్టి మాట్లాడకు వెళ్ళు ముఖం కడుక్కో ఆ ముఖాన్ని కాస్త పౌడర్ అది వేసుకో చూడటానికి అందంగా కనబడతావు అంది అమ్మ.
కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు అమ్మ కళ్ళకి నేను అందంగా కనబడుతున్నాను….
అబ్బాయి వాళ్ళు వచ్చారు పెళ్లిచూపుతో తంగమంతా పూర్తి అయింది.
అబ్బాయి కూడా నాకంటే అందహీనుడు కాస్త పొడువుగా ఉన్నాడు నాతో పోల్చుకుంటే కొంచెం నలుపు తక్కువగా ఉన్నాడు…
అబ్బాయి వాళ్ళ అమ్మ మీ అమ్మాయికి కట్న కానుకలు ఎంతస్తారేంటి అంటూ మొదలెట్టింది..
నాన్న ముఖంలో సంతోషం ఎక్కువైంది హమ్మయ్య మా అమ్మాయికి పెళ్లి అవుతుంది అని.
వెంటనే నాన్న ఈ ఆస్తి అంతా ఆమెదె అన్నాడు…
వెంటనే కాబోయే అత్తగారు ఈ ఆస్తి మా అబ్బాయి పేరున రాసి ఇవ్వాలి అంది…..
నాన్న ఆ మాటకు షాక్ తిన్నారు ..
అదేంటండీ మా అమ్మాయి ఆస్తి మీ ఆస్తి కాదా! అన్నాడు నాన్న….
మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేది ఆ డబ్బు గురించే కదండి లేకుంటే ఎవరైనా చేసుకుంటారు! మీ అమ్మాయిని..
అంది.
ఆ మాటలకు నాన్న నోటమాట రాలేదు.
సరే అండి నేను తర్వాత ఆలోచించుకుని చెప్తాను మీరు వెళ్ళవచ్చు అన్నాడు నాన్న కాస్త కఠినంగా…

నాన్న వంక అదేపనిగా చూస్తున్నాను నేను నాన్న ముఖంలో ఏదో అలజడి మొదలైంది….
నాన్న ఎందుకు మీరు అలా ఉన్నారు అని అడిగాను.

కాదమ్మా వాళ్ళు పెళ్లి కోసం రాలేదు డబ్బు కోసం వచ్చారు అమ్మాయిలు అంటే అంగడిలో వస్తువు అనుకుంటున్నారేమో! బహుశా వాళ్లు ఏం మాట్లాడినా ఒప్పుకుంటాం అనుకుంటున్నారు
ఆమె మాటలకు నాకు కోపం వచ్చింది. అందుకే తర్వాత ఆలోచించి చెప్తా అన్నాను అని ప్రేమగా అన్నాడు.

నాన్న ఈ లోకంలో అందమైన అమ్మాయిలకే రక్షణ లేదు పైగా నాలాంటి అమ్మాయిల పరిస్థితి …
అందుకే నాన్న నాకు చదువు తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నా మీరు నా మాట వినిపించుకోవటం లేదు అన్నాను.
మంచిగా చదువుకొని పదిమందికి సేవ చేస్తాను నాన్న .
మీరు అనుకుంటున్నారు. అమ్మాయిలకు పెళ్లి చేస్తే ఓపని అయిపోతుందని కాదు నాన్న పెళ్లయ్యాకే మొదలవుతుంది అసలు పనెంటో వచ్చే అబ్బాయి మంచోడు చెడ్డోడు
పెళ్లయ్యాక ఉంటుంది అసలు సమస్య.
పెళ్లంటే ఇద్దరి మనుషుల కలయిక ఒకరికొకరు గౌరవించుకుంటే ఆ ఇల్లు స్వర్గసీమ ఇద్దరిలో ఏ ఒక్కరూ బేధ అభిప్రాయం ఉన్న ఆ ఇల్లు నరకమయం నాన్న నువ్వు అమ్మతో ప్రేమగా ఉంటారు కాబట్టి. నాలాంటి అమ్మాయి ఉన్న మీ ఇద్దరు ఏనాడూ గొడవ పడలేదు
అంటే మీ ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు…..
మీలాంటి అందమైన జంటకు నాలాంటి అంద హీనమైన అమ్మాయి ఎలా పుట్టిందో అని నా కళ్ళలో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి.
వెంటనే మా నాన్న నన్ను తన గుండెలకు హత్తుకుని అమ్మా నువ్వు అచ్చు మా చిన్నాన్నల ఉంటావు తల్లి మా చిన్నాన్న గొప్ప అదృష్టవంతుడు తెలుసా. నా కూతురు ప్రపంచంలో అందరికంటే అందమైనది. నువ్వు బాధపడకు అంటూ నన్ను ఓదార్చారు.

మీ చిన్నాన్న మగాడు కనుక అతనికి పెళ్లి అయింది. నేను ఆడపిల్లను కనక నాకు పెళ్లి కావడం లేదు ఇదే నాన్న తేడా
అందుకేనేమో, ఆడపిల్లలే పుట్టోద్దు! అనుకుంటున్నారు.. పుట్టక ముందేచంపేస్తున్నారు…
నాన్న మీరు గొప్ప వాళ్ళు నన్ను బతకనిచ్చారు చదవనిచ్చారు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ రుణం తీర్చుకోలేను నాన్న అని ఎక్కి ఎక్కి ఏడ్చాను.
నాన్న వెంటనే నా కన్నీళ్లు తుడిచి ఓ నిర్ణయానికి వచ్చారు.
అమ్మా నువ్వు చదువుకుంటాను అంటున్నావుగా నువ్వు బాగా చదువుకో తల్లి నేను నీకు పెళ్లి చేయను నిన్ను ప్రేమించే వ్యక్తి వచ్చినప్పుడే చేస్తాను అని హామీ ఇచ్చారు నాన్న…..

నాన్న డబ్బు కోసం నన్ను ఎవరన్నా పెళ్లి చేసుకున్న మంచిగా చూసుకోరని మాత్రం నాకు అర్థమైంది.

ఈ రోజు నుంచే మొదలెట్టాను
చదువుకోవటం. చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి.
కష్టపడి చదివి ఐఏఎస్ సాధించాను.
ఒకప్పుడు నా అందం చూసి అసహ్యించుకునే వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అమ్మ మీది గొప్ప మనసు మీ లాంటి వాళ్లు ఈ సమాజంలో ఉండాలి ఆఫీస్ కు వచ్చిన ప్రతివారు అంటున్నారు…
ఆ మాటలు విన్న మా నాన్న సంతోషానికి అవధులు లేవు నిజంగా నేనే గనక పెళ్లి చేసి ఉంటే నా కూతురు ఈరోజు ఐఏఎస్ అయ్యేది కాదు….

అయినా నా కూతురు అన్నట్టు అందం కన్నా చదువు మిన్న. చదివే మనిషికి అలంకారము చదువుతోనే మనిషి జీవితం ముడిపడి వుంది. నా కూతురు అన్నట్టు ప్రేమ భావాన్ని, దయా బావాన్ని అందరికీ చాటుతాను. ఆడపిల్లలకు అందం ముఖ్యం కాదు చదువు ముఖ్యం
అన్నది నా కూతురి సందేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

కాలమహిమ