వింజమూరి సరస్వతి

కె.కె.తాయారు

మా అక్క వింజమూరి సరస్వతి రేడియోలో పాటలు,నాటికలు,
వివిధ భారతిలో అనౌన్సరుగా,
చాలా చాలా కార్యక్రమాలలో పాల్గొనేది.నాటకాలు సంగీత రూపకాలకు మంచి పేరు కూడా వచ్చింది ఈమెకి నేనంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే జడ వేయడం రాదు పెట్టేది కోతి టోపీ ఎందుకు అంటే నాకు జ్వరం వచ్చింది అని చెప్పు అనేది నాకు జడ వేయడం రాదుగా అనేది ఎప్పుడు తనతోనే ఉండేదాన్ని,ఆమెని మొన్న మే 30న పోగొట్టుకున్నాను.ఆమె పుట్టిన రోజు సెప్టెంబర్ 2 ఆ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా మీ అందరితో అందుకే ఈ అవకాశం తీసుకుంటున్నాను రేడియో ఉపయోగించుకునేది ఎలా అంటే పండగలు పబ్బాలలో ఎవరైనా ఆర్టిస్టులు రాకపోతే ఫోన్ చేసి వెంటనే పిలిచేవారు అంతే ఆ ప్రోగ్రామ్ అయ్యేవరకు అక్కడే ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితుల్లో మా అక్క భలే ఉపయోగపడింది ఎందుకంటే ఆమె అన్నింటిలో పాల్గొనేది అందుకే నిష్ణాతురాలు అందువలన ఆమెని రేడియో కార్యక్రమాలకు రికార్డింగ్ టైంలో వెంట వెంటనే పిలిచేవారు రేడియో కధలకి నాటకాలకి మహిళలు కార్యక్రమాలకి ఎవరిదైనా.ప్రసంగం చదవడానికి అనౌన్సర్ గా అన్నింటా అవసరానికి మా అక్కని పిలిచేవారు ఆ విధంగా అన్ని ప్రోగ్రాములులో పాల్గొని చక్కగా చేసేది మంచి పేరు కూడా వచ్చింది ఇంకా నేషనల్ ప్రోగ్రాం లో కూడా నాటికల్లోనూ మూడు గంటలకు వేసే సంగీతం రూపకాలలోనూ పాల్గొనేది మంచి పేరు కూడా వచ్చింది నాకు గుర్తున్న కొన్ని నాటికల పేర్లు వర విక్రయం,బారిష్టర్ పార్వతీశం,సూర్యుడు దిగిపోయాడు ఇంకా సంగీత రూపకాలు జీవన స్రవంతి,శ్రీనివాస కళ్యాణం ఇందులో నేను కూడా ఉన్నాను సోది చెప్పాను నేషనల్ ప్రోగ్రాంలు. మంచి అందరిలోనూ ఉంటుంది కానీ మా అక్క అందరి మంచి తనలో దాచుకుంటుంది నా పిల్లల్ని తన పిల్లలుగా స్వార్థం లేకుండా పెంచింది.మంచిది అందరి కోసం మా అందరి మనసులలో నిండిమంచిస్ధానం పొంది,అందనం.అలాగే ఒక గురువుగా 35 సం పనిచేసింది. నేడు గురుపూజాదినోత్సవం కావడం,నేడు ఆమెను ఒక గురువు కింద కూడా స్మరించుకోవడం నిజంగా యాదృచ్చికం.


ఆకాశవాణిలో ప్రఖ్యాత కళాకారులు అయిన శ్రీ వి.బి.ఆనంద్ గారు మా అక్కలు కుమారి.వింజమూరి లక్ష్మీ మరియు సరస్వతి ల గురించి రాసిన కొన్ని వాక్యాలు…
✍️✍️✍️✍️
నా ఆకాశవాణి నాటక ప్రస్థానంలో మొదటి నాటకం అన్నపూర్ణ లో వింజమూరి లక్ష్మి గారు అన్నపూర్ణగా నేను శ్రీకృష్ణదేవరాయగా నటించాం ఆ తరువాత అనేక నాటకాలలో ఆమె కథానాయికగా నటించింది నాతో నటించింది. కొంత సమయం జరిగిన తరువాత వింజమూరి సరస్వతి గారి నాకు జోడిగా వచ్చింది ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల మాలపల్లి ని తెలుగులో అనువదించి సంఘ విజయం పేరుతో నేను, కె.వెంకటేశ్వరరావు, జి యస్ ఆర్ మూర్తి, చిరంజీవి రావు కోటేశ్వరి, సత్యనారాయణ రాజు, సండూరి వెంకటేశ్వర్లు, సి.రామ్ మోహన్ రావు, ఎం ఝాన్సీ, ఎం సుశీల, సిహెచ్ వరలక్ష్మి తో పాటు వింజమూరి సరస్వతి కూడా నటించింది. తరువాత ఈ దేశం ఏం కావాలి నాటకంలో సీతారత్నమ్మ గారు నేను, వి.బి కనక దుర్గ, పాండురంగ, నండూరి సుబ్బారావు, సి రామ్ మోహన్ రావు కొండయ్యలతోపాటు సరస్వతి గారు కూడా నటించారు.
మనసులోని మహానాలం జాతీయ నాటకంలో బందా కనక లింగేశ్వర రావు, నేను వి ఎస్ నారాయణ మూర్తి, రామచంద్ర కాశ్యప, నండూరి సుబ్బారావు, వి.బి కనకదుర్గ ప్రయాగ వేదవతి లతో పాటు వింజమూరి సరస్వతి గారు కూడా నటించారు. రేడియో నాటక సప్తాహం కార్యక్రమాల్లో భాగంగా జీవనస్రవంతి సంగీత రూపకంలో కందుకూరు చిరంజీవి రావు, నేను,సి రామ్ మోహన్ రావు, రామచంద్ర కాశ్యప, నండూరి సుబ్బారావు బాల కోటేశ్వరిలతోపాటు వింజమూరిసరస్వతి గారు పాల్గొన్నారు. వేణుగోపాల రావు గారు రచించిన సూరీడు దిగిపోయాడు నాటకంలో సుత్తి వీరభద్ర, నేను పాత్రో అమరాలతతో వింజమూరి సరస్వతి గారు. పోలాప్రగడ వారు రాసిన కౌసల్య జాతీయ నాటకంలో నేను నండూరి సుబ్బారావు విబి కనకదుర్గ మున్నగు వారితో సరస్వతి గారు నటించారు. పంజరంలో పక్షులు నాటకంలో నేను, కమల కుమారి, పాండురంగ, సి. రామ్ మోహన్ రావు మున్నగు వారితో సరస్వతి గారు నటించారు. నాటి కలలు రేపటి నిజాలు సీరియల్ నాటకం లో నేనూ ఆలపాటి లక్ష్మీ శ్రీ గోపాల్ పాండురంగ భద్ర వ్రత కోకా సంజీవరావు సుశీల మున్నగు వారితో సరస్వతి గారు నటించాం. సరస్వతి గారు నాతో పాటు దాదాపు 50 నాటకాల వరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సున్నితమైన గొంతు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని దానిలో జీవించి చెప్పగలిగిన సత్తా ఆమెలో ఆప్యాయత,అణకువ కనిపిస్తోంది. ఎవరితోనూ అతిగా ఉండదు కానీ అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం. ఆమెతో నటించడం చాలా ఆనందంగా ఉంటుంది.

Written by K.K Tayaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాధ్యతతో కూడిన వ్యక్తిత్వాలు అవసరం

మన మహిళామణులు