బతుకు సూచీ..

డా|| చీదేళ్ళ లక్ష్మీ

టిక్ టిక్ మంటూ నడవడమే కాదు

నవరసాలకు స్పందించి కొట్టుకోవడమే బతుకు గడియారం

వేగంగా కొట్టుకున్నా

తక్కువగా కొట్టుకున్నా

ప్రమాదమే మరి

ఎంతలో ఉంటే అంతలో ఉంటేనే మంచిది!!

 

కాలమానం కొలమానమే కదా

హృదయ స్పందన ఒక కొలమానమే

బ్యాటరీ ఉన్నంత సేపే లోలకం ఊగుడు

ఊపిరి వున్నంత సేపే లోకం చూసుడు!!

 

ఆగిన గడియారం ముల్లు

కలత చెందుతుంది

పని అయిపోయిందని

పక్కన  పడేస్తారని!!

 

దీపముండగానే ఇల్లు చక్కదిద్దినట్లు

ప్రాణముండగానే అనుకున్నది సాధించి ఆదర్శంగా నిలిచి

కరిగిపోని అరిగిపోని

కాలంతో పాటు శాశ్వతంగా అందరి మదిలో నిలిచి వెలుగు!!

 

లబ్ లబ్ లబ్ డబ్ అన్నా

లబో దిబో అని కొట్టుకున్నా

క్షణం క్షణం ఉనికిని గుర్తు చేస్తూనే వుంటూ

ఎలా నడవాలో సూచించే సూచీ

పనిచేసేంత కాలం జాగ్రత్తగా

కాపాడుకుంటే పదికాలాలు

పదిలం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్షీరాబ్ది ద్వాదశి

అభిప్రాయ వేదిక