ఆమె 100కి పైగా కథలు 200పైగా వ్యాసాలు రాశారు.ఆంధ్రభూమిలో 500రూపాయల ఫస్ట్ ప్రైజ్ తన కథకు రావటం మర్చిపోలేని మధురానుభూతి అంటారామె.దుబాయ్ తెలుగు సంఘం వారిచ్చిన సేవారత్న బిరుదు తనసోషల్ వర్క్ కి గుర్తింపు అంటారు కామేశ్వరి.రేడియో నాటకాలు చిన్న కథలు రాయడం ఆమె కి ఇష్టం! సమాజానికి తోడ్పడే మంచి పనులు ఖాళీ సమయాల్లో వనితలు చేస్తే ఆతృప్తి ఆనందం వేరు.వ్యర్ధంగా కాలం గడపరాదు అనేది ఆమె పాటించే సూత్రం! అన్నవాహిక సమస్యతో బాధపడుతున్న భారత్ అనే బాబుకి ఆపరేషన్ కి అవసరమైన 65వేల రూపాయలు ఇతరులతో కలిసి సేకరించి ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత తన ఇంటికి వచ్చిన అతని కుటుంబానికి 10వేలు ఇచ్చారు.దీనికి మూల కారకులు ఏటి ఎన్ అడ్మిన్ అమర్ అని చెప్పారు ఆమె.
ఇక తన విశేషాలు ఇలా చెప్పారు”మా అమ్మ నాన్న గారు సాహిత్యం సంగీతం పై అభిరుచి ఉన్న వారు.అందుకే ఇంట్లో ఉన్న కథలు పుస్తకాలతోసహా ఎన్నో చదివాను.నేను 9వక్లాస్ లో ఉండగానే పెళ్లి ఐంది.మావారు ఏర్ ఫోర్స్ ఉద్యోగి.ఆగ్రాలో కాపురం! తెలుగు తప్ప వేరే భాష తెలీని నేను హిందీ నేర్చుకుని లైబ్రరీ పుస్తకాలతో కాలక్షేపం చేసేదాన్ని. మావారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావటంతో డిగ్రీ చదువు పూర్తి చేశానుకంప్యూటర్ నేర్చుకుని బ్లాగు ఏర్పాటు చేసికుని కవితలు రాశాను.క్రమంగా కాఫీ విత్ కామేశ్వరి అనే పేరుతో ఫేస్ బుక్ లో రాసిన అంశాలను పుస్తకం గా తెచ్చాను.గుండెల్లో గోదారి గోదావరి జిల్లాల వంటకాలు పుస్తకాలు వెలుగు చూశాయి.1965లోసరోజినీ పుల్లారెడ్డి గారు నెలకొల్పిన మహిళా మండలి లో20ఏళ్ళు ప్రధాన కార్యదర్శి గా ఉన్నాను.ఇప్పుడు కూడా చెతనైనసమాజసేవ తోటపని కార్తీక వనభోజనాలు సరదాగా కొన్ని ఈవెంట్స్ నిర్వహిస్తూ సత్కాలక్షేపం చేస్తున్నాను.” బాల్యం లోనే వివాహం ఐనా బాధ్యతలు పూర్తి ఐనా సమాజానికి ఏదో చేయాలని అనే కామేశ్వరి గారి మాట మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ?
బాగుంది కామేశ్వరి గారి పరిచయం. ఆవిడ నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్.. ఫేస్ బుక్ ద్వారానే పరిచయం…అభినందనలు ఇద్దరికి..