వినతులు

కార్తేకమాసమని సరదాగా వ్రాసినది

        దామర్ల విశాలాక్షి

ముక్కంటి తెరచి
నీ మూడవ కన్ను
మూర్ఖులాలోచనలు
దగ్ధమ్ము జేయు.

శివ మహాదేవ
నీ శూలమును పంపి
శిక్షించు దుష్టులను
శీఘ్రముగ స్వామి.

నటరాజశివయ్య
నంది నంపించి
నయవంచకులను
నాశనముజేయు

పార్వతీ వల్లభా
పరమేశ రుద్రా!
పాపాత్ముల
పీచమణిచేయుస్వామి

విశ్వేశ్వరా !దేవ
వీరభద్రునితో
విషమ పరిస్థితులిపుడు
అణచమని చెప్పు

పిశాచములను మించి
పిచ్చెక్కితిరుగు
పాపాత్ముల పైకి
ప్రమథగణములనుబంపు

అర్ధనారీశ్వరా !
అమ్మతోగూడి
అందరిని ఆదుకొని
చల్లగా బ్రోవు

విశ్వరక్షక స్వామి
వినతులివెఇ నీకు
విశాలవిశ్వములొ
శాంతి నెలకొల్పు.

దామరాజు..విశాలాక్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన విదూషీమణులు

మన మహిళామణులు