ఏమంటున్నది ప్రకృతి

ఎగిరే పక్షులు ఏమంటున్నాయి?

ఎగిరి ఎగిరి పడకే మనసా అంటున్నాయి.

కదిలే ఆకులు ఏమంటున్నాయి

కమ్మని కబుర్లు చెప్పవే మనసా అంటున్నాయి.

వీచే గాలులు ఏమంటున్నాయి

గాలి కబుర్లు మోయబోకే మనసా అంటున్నాయి

మందమందంగా సాగే మేఘాలు ఏమంటున్నాయి

చల్లచల్లగా తీపి కబుర్లు చెప్పవే మనసా అంటున్నాయి.

బంగరు వెలుగులు చందమామ ఏమంటున్నది

చక్కని ఊహలు చెప్పవే మనసా అంటున్నది.

తళతళలాడే నక్షత్రాలు ఏమంటున్నాయి.

ఎదలో మెరుపులు చూడవే మనసా అంటున్నాయి

మెరుపులు చూస్త ఏమి వస్తుంది అన్నది మనసు

అంతా వెలుగే, చీకటి వెళ్లిపోతుంది అన్నది ఎద

అదే నీ ఆశయంగా పెట్టుకో అని.

ఆ ఆజ్ఞా కూడా ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జీవించు, జీవించు, జీవించు

చెల్లని నోటు