మధులిక ఉద్యోగ విరమణ చేసింది. ప్రశాంతంగా జీవితం గడుపవచ్చు అనుకున్నయతాను ఉద్యోగం చేసే రోజుల్లో తన పిల్లలను. ఎక్కువగా పక్క ఇంటి వాళ్ళు. ఇంటి ఓనర్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు,
పిల్లలు బడి నుండి ఇంటికి రాగానే వాళ్లకు కావలసినవి ఇంట్లో పెట్టి తాళం వేసి పక్కవాళ్ళకు ఇచ్చేదో పిల్లలు రాగానే
80 తిసి నేను వచ్చే వరకు వాళ్ళ పర్యవేక్షణ ఉండేది. వాళ్ళ మంచి తనం కావొచ్చు, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. ఉదయం వెళ్లి పోతే సాయంత్రం ఇంటికి వచ్చేవరకు ఏ భయం నాకు ఉండేది కాదు. పక్కన వాళ్ళ నాకు ఉన్న నమ్మకం సమాజంలో ఎలాంటి దుర్మార్గం లేదు కాబట్టి నిర్భయంగా ఆడపిల్లల్ని పక్క ఇంటి వాళ్ళ నమ్మకం ఎదురింటి వారిపై నమ్మకంతో వదిలి, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలిగాను. అమ్మాయిలు ఉన్నత చదువులు చదివారు ఏనాడూ ఏ సమస్య ఎదురు కాలేదు. క్రమ శిక్షణకు క్లాసు తీసుకోలేదు. సహజ సిద్ధంగా వారికీ, మంచి, మర్యాద పెద్దలపై గౌరవం కష్టపడేతత్వం ఈ పని చేస్తూ చదువులో అందరి కంటే ముందు ఉండే వారు. అందరికీ ఆదర్శం నా పిల్లలు, వాళ్ళను చూసి నేర్చుకోండి అని పిల్లలకు చెప్పుకునే వాళ్ళు, కొంతమంది బంధువులు.
పిల్లలు చెప్తే నేర్చుకోరు. తల్లి తండ్రి, కుటుంబ వాతవరణం చూసి నేర్చుకుంటారు,అనటానికి నా పిల్లలు చక్కని ఉదాహరణ అనే సంతృప్తి ముథులికకు ఉంది.
45 ఏళ్ళు గడిచి పోయినవి అమ్మాయిలకు పెళ్లి చేసాము వీరి పిల్లలు. వారు ఉద్యోగాలు చేస్తున్నారు . ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే అవకాశం, కార్లు, ఆర్.టి.సి బస్సు ఎక్కవలసిన అవసరం లేదు. అన్ని హంగులు, సొంత భవనాలు, సకల సౌకర్యాలు అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు అరణ్యంలో ఉన్నంత భయంగా బ్రతుకు తున్నారు.
పిల్లలను పాఠశాలకు వ్యానులో పంపిన ఏదో తెలియని భయం ఇంటికి పిల్లలు వచ్చి కనపడేవరకు ఆఫీసులో ఉన్నా పిల్లలపై ధ్యాసే ప్రక్క వాళ్ళు కాదు. సొంత బంధువులను కూడా నమ్మలేని మాయదారి సమాజంలో బ్రతుకుతున్నారు. తల్లికి తండ్రి కి ఏ పని మీద మనస్సు లగ్నం కావడం లేదు. అమ్మాయిలు పాఠశాలకు వెళ్లినా, కళాశాలకు వెళ్లిన ఇంట్లో ఉన్నా తల్లి తండ్రులు ఆందోళన పడుతున్నారు. మనుషుల మధ్యస ఉన్నామన్న భద్రత లేదు. .
అపార్ట్మెంట్ లో ఉన్నా గ్రేటర్ కమ్యూనిటీలలో ఉన్నా ఇండ్లలో ఉన్నా ప్రశాంత లేని జీవితం ఈ రోజు ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు గడుపుతున్నారు. ఎందుకూ? మనిషి జన్మలో తేడా లేదు. తేడా అంత మనస్సులోనే సాంకేతికంగ సాధించిన విజయం సద్వినియోగం అవడం లేదా? మనిషి వస్తు వ్యామోహంలో స్వార్థం పెంచుకొని, మత్తుకు బానిసై, వ్యసనాలకులోనై, వ్యక్తిత్వాన్ని మంట కలుపుకుంటున్నారు. మేము బాగుంటే చాలు అనే స్వార్థానికి వెళ్లిపోయారు. ఎవ్వరిని నిందించి లాభం లేదు. ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. రాజకీయ నాయకులను తిట్టుకుంటాం. అలంటి వారిని ఓటు వేసి గెలిపించింది ఎవ్వరు? సామాన్యులు కదా? అమూల్యమైన ఓటును అమ్ముకుంటున్నది ఎవరు? ప్రజలు కదా? మేధావులు మౌనం పాటిస్తున్నారెందుకు? అన్ని తెలిసిన వాళ్ళు ఆగమై పోతున్న సమాజాన్ని చూస్తూ మౌనం పాటిస్తున్నారెందుకు కాకి చనిపోతే మిగిలిన కాకులు కావ్ కావ్ మంటూ గుంపులుగా వస్తాయి. ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ తన తోటి దాన్ని పై దాడి చేస్తే ఊరుకోవు, మనుషులుగా ఉన్న మనకు ఏమైంది? చావకుండా బ్రతికే శక్తి ఎవ్వరికి నా ఉన్నదా, ఉన్న కొన్ని రోజుల్లలో ఇంత దుర్మార్గమైన బ్రతుకు ఎందుకు అని ఆలోచించుకుంటూ ఉన్న ‘మధులికకు ఫోన్ రింగ్ అయింది. వెళ్లి ఎత్తింది హలో అమ్మా ఇంటికి పిల్లలు వచ్చారా? అన్న కూతురు గొంతు, వస్తున్నారంటే వ్యాసు కొంచం ఆలస్యం అయిందంట తన ఫోన్ తో మల్లీ పిల్లలకు ఫోన్ చేసి ఎక్కడికి వచ్చారు. దగ్గర్లోనే ఉన్నాం 6 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. మనస్సు ప్రశాంతం గోడ గడియారం వైపు చూసుకుంటూ కూర్చున్న మధులికకు వాళ్ళ అమ్మ గురుతుకు వచ్చింది. నేను పది నిముషాలు ఆలస్యంగా ఇంటికి వస్తేనే అమ్మ గేట్ దగ్గరికి వచ్చి నేను వచ్చే గల్లీ వైపు చూసి మల్లి లోపలి వెళ్లి మల్లి బయటికి వచ్చేదట. ఇంటికి రాగానే అమ్మ గ్లాసుతో నీళ్లు తీసుకొని ఎదురు వచ్చి త్రాగు అనేది. తరువాత ఎందుకు లేట్ అయింది అమ్మా అని అడగది ఆర్ టి సి బస్సు లేట్ అయింది అమ్మ అని చెప్పేదాన్ని. నా బిడ్డలు నవ్వుతు అమ్మమ్మ లోపలికి బయటకు తిరుగుతుంది. గడియారం వైపు చూస్తుంది. అనేవాళ్ళు బహుశా తల్లి మనస్సు ఆతృత ఏమిటి అన్న విషయం వాళుకె కాదు నాకే తెలిసేది కాదు ఆనాడు నా పిలలు. ఆలస్యంగా వచ్చినప్పుడు తల్లి మనను. ఏమి ప్రతి తల్లి ప్రాణం బిడ్డలచుట్టూ తిరుగుతుంది అన్న విషయం ఏనాడైనా ఒకటే దానిలో మార్పులేదు. బిడ్డల క్షేమము కొరె మొదటి వ్యక్తులు తల్లితండ్రి. ఆ తల్లి తండ్రి ఈనాడు ప్రశాంతంగా లేక అనుక్షణం ఆవేదనకు గురి అవుతున్నారు.
మగపిల్లలను ఆడపిల్లలను పెంచేటప్పుడు ఇంట్లో చూపించే వ్యత్యాసమే కొంతవరకు కారణం అబ్బాయి ఎలా తిరిగిన పరవాలేదు ఏమి చేసిన పరువలేదు. ఏ రాత్రి వచ్చిన సిగరెట్ త్రాగిన? మద్యం తగినా? పరవాలేదు. అనే ఉదాసినత ఈనాడు యువత తప్పు మార్గంలో పోవడానికి కొంత కారణం ఈనాడు వస్తున్నా ఫోన్స్ సాంకేతికతను తిట్టుకునే మనం పిల్లలకు పాలు త్రాగేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు అవి చూపిస్తూ తినిపిస్తున్నాము, అవి కొనిస్తున్నాము ఆడుకోవడనికి అని చేతికి ఇస్తున్నది ఎవరు. మనం కాదా, పెద్దవాళ్ళు అయినా తరువాత రకరకాల ఫోన్సని కొని ఇచ్చేది ఎవరు? మనం మొదట మారాలి, తరువాత సమాజం మార్పు గురించి మాట్లాడాలి, సమాజం పాడైపోయింది. అని ప్రతి ఒక్కరం బాధపడుతున్నాం ఈనాడు ఆడపిల్లలు కన్న తల్లి తండ్రులు కాదు పసి పాపా నుండి వృద్ధురాలు వరకు బలియై పోతున్నారు. మనుషుల మధ్యలో ఉన్నామా లేదా అరణ్యంలో క్రూర జంతువుల మధ్యన ఉన్నామా! అనిపించింది మధులికకు. పాఠశాల వ్యాను దిగి వచ్చిన మనుమరాండ్ల వైపు చూసి ఈరోజు కు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నది మధులిక కూతురు ఆఫీసు నుండి ఎపుడు వస్తదో అని ఎదురు చూస్తూ గడియారం వైపు చూసి సామనుమరాండ్లు నవ్వుతు అమ్మ రాక కోసమణ్ అన్నారు.
కాల చక్రం తిరుగుతూనే ఉంది. కాలుష్యం పెరుగుతున్న కటిక దారిద్ర్యంలో, ఆకలితో అల్లాడిపోతున్న దోపిడీలు చేస్తూ దొర బాబుల తిరుగుతున్న ఆడవాళ్ళ బ్రతుకు ప్రశ్నార్థక మౌతున్నా అన్యాయం అందలం ఎక్కుతున్నా! న్యాయం నడి రోడ్డు పై నిలబడి ఏడుస్తున్న కల్మషం లేని కాలం ఆగదు. తిరుగుతూనే ఉంటుంది. ఏ రోజుకారోజు గడిచిపోతుంది కానీ మనుషులలో మార్పు రావడం లేదు. ఏ రోజు పేపర్ చూసినా, ఏటీవీ ఛానెల్ పెట్టినా ఆడపిల్లపై జరిగే ఆత్యాచారాలు అంతుపట్టకుండా, తల్లి తండ్రుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీళ్ళను క్రూర మృగాలతో పోల్చితే అవి కూడా ఒప్పుకోవు ఏప్రాణితో పోల్చిన అవి ఒప్పుకోవు అంత నిఖీచానికి దిగి పోతున్న మొగ జాతి ఎక్కడి నుండి వచ్చింది. ఒక తల్లి కని పాలిచ్చి పెంచి పోషించినందు వల్లే కదా? ఆ తల్లి
పెంపకంలోనే తప్పు ఉందా? ఆతండ్రి ఇచ్చిన ధైర్యమా? ఏమిటి వింత ప్రవర్తన సభ్యసమాజం సిగ్గుపడాలి అలంటి వాళ్ళు సమాజంలో తిరుగుతుంటే సమాజం ఎలా! ఈ సమాజమును బాగు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. అని మధులిక. ఆలోచిస్తుండగానే, కూతురు వచ్చినట్లు కారు శబ్దం అయ్యింది, ఇంత ఆలస్యం అయిందమ్మా అన్నధీ. అమ్మ బాగా ట్రాఫిక్ ఉన్నదీ అందుకే ఆలస్యం అయింది అన్నది. అమ్మ ఆనాడు నా కోసం ఎందుకు ఎదురు చుసేదో ఇప్పుడు నాకు అర్థం అయింది అనుకున్నడో మధులిక, అమ్మ రాగానే పిల్లలు వాళ్ళ ఈ రోజు పాఠశాల విశేషాలు కళాశాల విశేషాలు చెప్పారు తల్లికి, తల్లి సంతృప్తి పడింది. అందరూ ఎవరికి వారు రేపటి తయారు హోంవర్కులు వగైరాలు చేసుకున్నారు. కూతురు రాత్రి పంట కోసం ప్రయత్నాలు చేస్తుంది. అల్లుడు ఇంటికి వచ్చేవరకు రాత్రి 8 గంటలు అవుతుంది అన్ని కంపెనీ బాధ్యతలు ఉంటాయి. ఆ కంపెనీకి మేనేజర్ ఆయన పనులు ఆయనకు సరిపోతవి. ఇంటి పనులు పిల్లల విషయం అన్ని కూతురే సమర్థంగా నిర్వహించుకుంటుంది. పిల్లల చదువులు, వాళ్ల సందేహాలు అన్ని ఆమె చూసుకుంటుంది. వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి బయలుదేరింది. 5 నిమిషాల నడక దూరంలో తన ఇల్లు ఉన్నదీ, అందుకే పిల్లల యోగక్షేమాలు చూస్తూ తిరుగుతాము నేను నా భర్త
ఈలాంటి సౌకర్యం లేని వాళ్ల పరిస్థితి ఏమిటీ అని ఇద్దరం ఆలోచిస్తూ టీ త్రాగుతూ ఈ రోజు వార్తలు చర్చించుకుంటూ కూర్చున్నాం.