కళ్ళు తెరవని నెత్తుటి ముద్దను కుప్ప తొట్టిలో, మురికి కాలువలో వదిలేసే మృగాళ్లు ఉన్న ఈ సమాజంలో
సాధికారత మహిళకు సాధ్య పడదు.
కామంతో కళ్లు మూసుకుపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాల యములై పసివాడని మొగ్గలను చిదిమేస్తున్న కీచకులు ఉన్నన్ని రోజులు
సాధికారత మహిళకు సాధ్యపడదు.
వరకట్న వేధింపులు ,అనుమానపు జబ్బులతో తూటాల్లాoటి మాటలతో ,ఈటెల్లాoటి చూపులతో మహిళలను అనుక్షణం చిత్రవధ చేస్తున్న నరరూప రాక్షసులు ఉన్నంతకాలం
సాధికారత మహిళకు సాధ్యపడదు.
స్త్రీని దేవతగా కొలిచే భారతావనిలో మగువల మనోభావాలకు విలువ లేకుండా, ఆడదాన్ని అంగడిబొమ్మలా చూసే నీచులు ,నికృష్టులు ఉన్నంత కాలం సాధికారత మహిళలకు సాధ్యపడదు
సాధికారత మహిళలకు సాధ్యపడని వంటకమైతే రుచులు కోరే ఇంటివారికి అరుచుల జీవనమే జరిగేది. –