మన మహిళామణులు

బహుముఖ సేవా పరాయణ శ్రీమతి కమలాకర భారతి గారు

స్వశక్తితో ఈమె చేస్తున్న సంఘసేవ సాహిత్య సేవ మనందరికీ ఆదర్శం. ఈమె సేవ లగూర్చి తెలుసుకుందాం.‌‌..

ఆమె ఒంటరిగా నడుపుతున్న సేవా సంస్థలని గూర్చి తెలుసుకుంటే ఆనందం ఆశ్చర్యం కలుగుతుంది.చదువు ఉద్యోగం
కడుపులో చల్ల కదలకుండా ఉండే మహిళలు చేయని పనులను ఆమె చేయటం నాకు అద్భుతం గా అనిపించింది.సోషల్ వర్క్ నానా విధాలుగా చేయవచ్చు.కాని భారతి గారు బాలలు మొదలు పండువృద్ధులకోసం నెల కొల్పి న సంస్థలు సాహిత్య సేవ శ్లాఘనీయం.రామంతాపూర్ లో ఆమె పేరు తెలీని వారు లేరు.1990 సెప్టెంబర్ 5న కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు నినెలకొల్పారు.దివిసీమ తుఫాన్ బాధితులకు చేసిన సాయం మాటలకందని ది.వందకుటుంబాలకు దుస్తులు ఆహార పదార్థాలు పాత్ర లు పంపిణీ చేశారు.వృత్తివిద్యా నైపుణ్యం కోసం 1996లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించారు.2001వరకు ప్రభుత్వ సహకారంతో 60మంది పేద విద్యార్థులు పి.జి.డి.సి.ఎ. సర్టిఫికెట్ కోర్సు లో ఉచిత శిక్షణ పొందారు.ఇందులో స్వయంఉపాధి పధకానికి ఊతం ఇచ్చింది ఈసంస్థ.


1999లో మమతవృద్ధాశ్రమం ని నెల కొల్పారు.వసతి భోజనం శారీరక మానసిక ఉల్లాసం కొరకు ఆధ్యాత్మిక సత్సంగాలు సాహిత్య సమ్మేళనాలు ఏర్పాటు చేశారు.
బడుగుబీద బాలల కై2001లోఇంగ్లీష్ మీడియంలో వికాసభారతి అనే ప్రాధమిక పాఠశాల ని నెల కొల్పారు.నేడు 10వతరగతి దాకా 300పైగా పిల్లలు చదువుతున్నారు.నైతికవిలువలు పెంపొందించడం ఆమె లక్ష్యం! దేశ భక్తి దైవభక్తి తోపాటు ఆటపాటలు నాట్యంలో కూడా పిల్లల కు తర్ఫీదు ఇస్తారు.
ఇంతేకాక తెరమరుగైన కళాకారులకు చేయూత ఉత్సాహం అందించే దిశగా 2004 లో లలితకళాభారతిని నెల కొల్పారు.నెలనెలా సాహిత్య పరిమళాలు అనే పేరు తో గ్రంధావిష్కరణతో పాటు నాటకాలు నృత్యాలు సంగీత కచేరీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మహనీయుల జయంతి వర్ధంతి సందర్భంగా జాతీయ పండుగ రోజుల్లో సంఘం లో చైతన్యం కలిగించే దిశగా ఈమె సంస్థలు కృషి చేస్తున్నాయి.2006లో కమలాకరసేవారత్న అవార్డు ని ప్రారంభించారు.ఆనాటి జె.ఎన్.టి.యు.వైస్ ఛాన్సలర్ శ్రీ రాజగోపాల్ గారికి తొలుత ఇవ్వటం జరిగింది ఈ అవార్డు అందుకున్న కొందరు ప్రముఖులు ఎవరంటే అప్పటి కర్నాటక గవర్నర్ శ్రీమతి వి.ఎస్.రమాదేవి శ్రీ ఎల్.వి.గంగాధరశాస్త్రి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాల కృష్ణ గోఖలే మొదలైన వారు!
ఇంతేకాక జీవనవికాసం మాతృవందనం పాడవోయి భారతీయుడా బాలసంజీవని భారత్ జయహో మొదలైన పుస్తకాలు ప్రచురించి ఆవిష్కరించారు.వీటిని ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకి పంచటం జరిగింది.ఈసంస్థకు వచ్చిన అవార్డు లలో కొన్ని మాత్రమే పెర్కొంటాను.ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది.వివేకానంద ఎక్సలెన్సీ ;సంఘసేవిక ; బెస్ట్ ఛైర్ పర్సన్ _ఎడ్యుకేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్; బెస్ట్ ఆల్ రౌండ్ ప్రెసిడెంట్ ఆదర్శ వనిత అక్కమ్మ పోతుకూచి సుబ్బమ్మ అవార్డు రివార్డులు మొదలైనవి.భర్త శ్రీ కమలాకర్ మెకానికల్ ఇంజనీర్ అకాల మరణంతో భారతి గారు సంఘసేవలో పూర్తిగా మునిగి పోయి తన జీవితంలో ఓవెలుగు బాటను ఏర్పర్చుకొని సమాజసేవలో ఇతరులని భాగస్వాములు గా చేస్తూ ఆదర్శ తరుణి గా నిలిచారు.రైతు కుటుంబం లో పుట్టిన ఈమె పరులకొరకై తపించే ధన్యజీవి! ఈమె ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలి అని తరుణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదైవాన్ని ప్రార్ధిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇలా కూడా…

ఉషోదయం