మనిషన్నాక మాట
మనసులో మాట
చెప్పాలని ఉంది
ఎంతకీ
గొంతులోనే కూరుకుపోయి
బయటకు రాదే!!
కొన్ని నచ్చుతాయి
కొందరు నచ్చుతారు
బాగున్న లేకున్నా
వారి చుట్టే తిరుగుడు
ఏంటి పక్షపాత వైఖరి
ఏంటో యీ మనస్తత్వం
అర్థంకాని సమస్య!!
ఎంతో చెప్పాలని ఉంది
మనసులో గుట్టు విప్పాలని ఉంది
కానీ ఇష్టాఇష్టాలు
చెప్పేదొకటి
చేసేదొకటి
తీపి తీపి మాటలు
పైపైనే!!
ఆత్మీయత కరువై
అనుబంధం బరువై
సాగుతున్న సంసారం!!
ప్రేమ శాంతి సత్యం
అన్ని మతాల సారం ఒకటే
అయినా కక్షలు
ఏంటో అర్థం కాని వైనం!!
ఆడపిల్ల అంటే ఆడపిల్లే
ఏమిటి వివక్ష
ఎందుకో వ్యత్యాసం
అంతా సమానమే
పేరుకుపోయిన మాట
పాచిపట్టిన పాతపాట
అనురాగం అందేదెన్నడో!!