కాంత లేని గృహం కాంతివిహీనం!
కళావిహీనం!!
చీకాకులన్నీ చెదిరిపోతాయి కనకం చెంత ఉంటే
సరదాలెన్నో కూడి మసలుతాయి కాంత చెంత ఉంటె
యుద్ధాలకు, కయ్యాలకు కారణమని కాంతలపై
పురుష దురహంకారం మోపే నెపాల వలలు
రాజ్య విస్తరణ కాంక్ష,అభిజాత్య,అహంకార,
బలహీనతల అసలు మూలకారణాలు!
కాంతులీనే దరహాసాలొలికే కాంత మోము చూడగానే
మగని మనసుకు కలుగదా ప్రశాంతత!
సమస్యల వర్షంలో తడిసిన వేళ
కాంత సలహాల గొడుగు
అలసినవేళ అనురాగపు మడుగు పరిచే చెలిమి
ఏకాంతంలో కాంతునికి చక్కని తోడు కాంత!
సేవలు చేసే వేళ తల్లిని మరపించే అనురాగం
సుఖశాంతులు,
సంతాన సౌభాగ్యాలనందించే సాధ్వి
స్వగృహంలో తెచ్చిచ్చే సంతోష మోదాలు సంఘంలో వచ్చే హోదాలు
వివాహం లో అందించే పసిడిరూప కన్యాదానాలు
అవసరాల వేళ ఆర్థిక తోడ్పాటు ఆనందాల ఆసరా!
అంతరాల కొలమానాలు కాదుగాని
వ్యసనపరుడైన,దుర్మార్గుడైన…
బంగారు తాళి ఆలికి ఇచ్చే ఆర్థిక భరోసా!
పరకాంతా వ్యామోహం కూడనిది…
ఇది తెలుపనిదెవరికి ?
ధర పెరుగడమే తప్ప
తరుగడమన్నది లేని
కనకం
ఆదరణ పెరగడమే తప్ప తరగడమన్నది తెలియని కాంత
పోలికలు ఏలికలు
మరుపు తెలివిడి – ఓ జాగ్రత్త
పెరుగుదల తరుగుదల – ఓ కారణం
అతి సర్వత్ర వర్జయేత్
వ్యామోహం పెద్ద అనర్థం