దీపావళి

అమావాస్యలో శశికాంతిలా అరుదెంచిన వేడుక

ప్రతి మదిని పున్నమిగా విరబూసిన కానుక

కనుల వెలుగు చిరుజ్యోతుల కర్పూర మాలిక

కలలు పంటు మధురిమల దివ్య దీప వేదిక

తారల తోరణములు

తెలివెన్నెల కిరణాలై

మతాబులే మణిహారపు

మధుగీతి చరణాలై

మెరుపుల వెల్లువలో

కాంతుల పల్లవిగా

తీయని భావములే ప్రసరించు హేల

స్వప్నాలు విరబూయు వెలుగుల మాల

మురిపించు ఆనంద శోభావళి

మైమరపించు అందాల దీపావళి

Written by Puvvada Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాల తరుణి

చెట్టు నీడ ( కథ )