రారండోయ్, రారండోయ్ మన గుడి రాములవారి పెళ్ళికి రారండోయ్, రారండోయ్ పిల్లలు, పెద్దలు అందరూ రారండోయ్ – మంత్రులు, పెద్దలు వస్తారు.
నెత్తిన పట్టువ్రసా్తలు, ముత్యాల తలంబ్రాలతో ముందు రక్షక భటులు, వెనక రక్షకభటులు. రారండోయ్ వీరిని కూడా చూద్దాము. భద్రాద్రి రాములయ్యకే కాదండి, పట్టు వస్త్రాలు, ముత్యాలు తమ తమ ఆర్థిక స్తోమతతో అంది గుళ్లికా అందరు. అన్నీ సమర్పిస్తున్నారు. తమ తమ భక్తిని చాటుతున్నారు.
రారండోయ్, రారండోయ్ మంత్రుల కెదురేగి ప్రధాన అర్చకులు
ఘన స్వాగతం పలుకుతారు. నెత్తిన మాటలు దింపుతారు. ||రారండోయ్||
వారి వెనుకనే వారి కుటుంబీకులు ముందర వరసను అలంకరిస్తారు.
ప్రక్కన M.L.A లు, వారి సతీమణులు, ||రారండోయ్||
అర్చకులు వేదమంత్రాలు చదువుతుంటారు మంత్రులను, M.L.A.లను అందరిని చూస్తూ
ఇంతలో విడియో గ్రాఫర్ లు వస్తారు. కల్యాణ వేడుకలు పోటీపడి తీయడానికి
అర్చకుల దృష్టివారివైపు వెళ్తుంది తమ ముఖాలు సరిగా రావాలని ముందుకు జరుగుతారు ||రారండోయ్||
ఇంతలో మాంగల్య ధారణ అంటారు. ముందుగా మంత్రిగారి సతీమణి దగ్గరకు తెస్తారు సూత్రాలు
వాటిని తాకి, కళ్లద్దుకోవటానికి వరుసన అందరి ప్రముఖుల వద్దకు
తీసికెళ్తారు, నమస్కరించటానికి వెనకనున్న జనం ఎగిరెగిరి నిలుచుంటారు
కనీసం సూత్రాలను దర్శిద్దామని ఇంతలో సన్నాయి మేళం హోరెత్తుంది మాంగల్య ధారణ అయిపోయింది
మంత్రులు లేస్తారు, వారి వెనుక అర్చకులు వారి బాధలు విన్నవిస్తూ నడుస్తుంటారు
వారు సగం విని, సగం వినక కారెక్కుతారు ||రారండోయ్||
మిగిలినవారిని, పదండి భోజనాలకు లేవండి అని మైకులో చెప్తారు వీరు వడివడిగా వెళ్లి భోం చేస్తారు.
త్వరత్వరగా ఇంటికి వెళ్తారు ఇంట్లో T.V.లో జరిగిన కల్యాణం చూద్దామని వారు ఉన్నారో లేదో చూసుకుందామని వారి ముఖాలు కనపడితే విడియో గ్రాఫర్లను మెచ్చుకుంటారు లేకుంటే ఈ విడియో గ్రాఫర్లకు కవరేజి చేయటం చేతకాదని వీరి ఆర్డర్స్ ఇవ్వద్దని అందరికి చెప్తారు ||రారండోయ్||
ఇవ్వండి మన రామయ్య పెళ్ళి ముచ్చట్లు