కవయిత్రుల కవి సమ్మేళనం

తెలంగాణ భాషా సాంస్కృతిక వేదిక 30_9_2022 నిర్వహించిన ‘బతుకమ్మ ‘ కవయిత్రుల కవి సమ్మేళనం లో తమ కవితల ద్వారా బతుకమ్మను అద్భుతంగా ఆవిష్కరించారు. బతుకమ్మ పూల పండుగ స్త్రీల పండుగ .కానీ పూలు స్త్రీలు కుటుంబ నేపద్యంతో కూడిన బ్రతుకు జీవనం అనే స్పృహతో సాగే ఈ పండుగ విశిష్టత ప్రతి కవిత్వంలోనూ ప్రతిబింబించింది. కుటుంబం అంటేనే స్త్రీ పురుషుల సహజీవనము సమజీవనం. పిల్లాపాపలతో వర్ధిల్లేది. అనంతమైన భావావిష్కరణతో వచ్చిన ఈ బతుకమ్మ మౌఖిక సాహిత్యం సాహితీవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది . వేల ఏళ్లుగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు. ఆటపాటలకు కొలువైన పండుగ ఇది. ఈ పాటలను ఎవరు రాసి ఇవ్వలేదు. ఏ లిఖిత రూపము లేదు .ఏ గురువు లేడు. ఏ బడులు లేవు. జీవితమనే ఈ పాఠశాల ఆడవాళ్ళందరికీ జీవన సత్యాలను బోధిస్తుంది కదా! జీవితమే పెద్ద పాఠశాల. ఆనందాలు సంతోషాలు కష్టాలు నష్టాలు అన్ని బతుకమ్మ పాటల్లో చోటు చేసుకుంటాయి. జీవితం సర్వ కళాత్మక సుందర దృశ్యం అనేది ఈ పాటల్లోని సారాంశం. ఇవన్నీ స్పృశిస్తూ బతకమ్మ పండుగ విశిష్టతను చెబుతూ రకరకాల రూపాలతో వర్ణించారు కవయిత్రులు ‘బతుకమ్మను ‘. ఆధ్యాత్మిక దృక్పథంతోను ఆధునిక దృక్పథంతోను బ్రతుకమ్మ ఒక మహా శక్తిగా స్త్రీలకు ఆలంబనవుతుందన్న భావాన్ని వ్యక్తపరిచారు. ఈ విశేషాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి కొన్ని ఫోటోలు మచ్చుకు ఇక్కడ తరుణి పాఠకుల కోసం…
డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి వార్తలు

తరుణి ముఖ చిత్ర కవిత