జననం 27 సెప్టెంబర్ 1871 మరణం 15 ఆగష్టు 1936
గ్రేజియా డెలెడా ఇటలీ రచయిత. సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి 1926 లో నోబెల్ సాహిత్య బహుమతి పొందారు.
గ్రేజియా ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె ప్రాథమిక పాఠశాలలో విద్య పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేటు టీచర్ సహాయంతో చదువు కొనసాగించారు. సాహిత్యాభిలాష కలిగి సాహిత్యరంగంలో విశేష కృషిచేశారు.
ఆమె L’అల్టిమా మోడాఅనే మ్యాగజైన్ లో కొన్ని నవలలు ప్రచురించారు. అవి పద్య, గద్య రూపంలో ప్రస్తుతం కూడా ప్రచురింప బడుతున్నది. 1890 లో Nell’azzurro అనేది ట్రెసా ద్వారా ప్రచురింపబడింది. ఈ రచన ఆమె మొదటిదిగా గుర్తింపబడింది.
ఇప్పటికీ గద్య భాగం, కవిత్వాలతో 1896 లో “స్పైరాని” ప్రచురించిన, పేసాగ్గి సర్ది, మొదటి రచనల్లో ఒకటిగా ఉన్నాయి. 1899 లో “పాల్మిరో మాడసాని”ను వివాహం చేసుకున్నారు. 1900 లో ఆమె రోమ్ నగరానికి పయనమయ్యారు. 1895 లో ప్రచురితమైన “అనిమె ఒనెస్టె” , 1900 లో ప్రచురితమైన “ఇల్ వెక్కియో డెల్లా మొంటాగ్నా” తర్వాత ఆమె వివిధ మ్యాగజైన్లైన “లా సార్డెగ్నా”, “పిక్కోలా రివిస్టా”, “నువా అంటోలోగియా” వంటి సహకారంతో తన రచనా కృషిని కొనసాగించారు.
1903 లో ఆమె “ఎలిసా పోర్టోలు”ను ప్రచురించారు. ఇది ఆమె విజయవంతమైన నవలా రచయితగా నిరూపించే రచనగా ఖ్యాతికెక్కింది. ఆతర్వాత ఆమె యితర పనులు “సెనెరె” (1904),L’ఎడెరా (నవల) (1908), సినో ఆల్ కన్‌ఫైన్ (1911), కొలంబి ఎ స్పార్‌వైరి (1912), కాన్నె వాల్ వేంటో (1913)ముఖ్యమైనవి. ఆమె ప్రసిద్ధ పుస్తకాలు ఇటలీలో — L’ఇంసెన్‌డియో నెల్ల్ ఒలివెట్టో (1918), ఇల్ డియో డీ వెంటీ (1922)లు.
ఆమె రోమ్ నగరంలో 64 వ యేట పరమపదించారు. సాహిత్యరంగంలో ఆమె చేసిన కృషి అజరామరం.