అధ్యాపిక

అజ్ఞానానందకారాన్ని తొలగించి ,వెలుగులను నింపే జ్ఞానప్రదాత.
దిశానిర్దేశం చేసి , జీవితాన్ని చక్కదిద్దే గురువు
బడి మెట్లు బ్రతుకు మెట్లని నేర్పిన
ఉపాధ్యాయిని
తల్లితండ్రులు స్థానాన్ని తీసుకొని,చేయి అందించే ఓమార్గదర్శి
పెరుగుతున్న బుద్ధి కి
పదును పెట్టే కళాశాల అధ్యాపిక
గెలుపు దారుల చూపే
ప్రత్యక్ష దైవమే
కనులముందు ఉండే
దైవ స్వరూపమే
బండరాయిగా ఉన్న
మమ్మల్ని సజీవ శిల్పాలుగా తయారుచేసే ఓర్పు శిల్పి
మంచి చెడుల
విషయాలన్నీ విడమరిచి చెప్పే దిక్సూచి
ఇన్ని ఏళ్ళు వచ్చినా
ఆత్మావలోకన భావంలో
ఎన్ని విధాలుగా కీర్తించినా
మీ ఉనికి మారనిది
మీ రుణము తీరనిది

వరంగల్
9849168609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అప్పులిస్తున్నారు జాగ్రత్త?!

లేడి కండక్టర్