త
చిత్రకారిణి : కిల్లంశెట్టి ప్రీతి, వెస్ట్ బెంగాల్
వెన్నెల రాత్రులు చీకటి కబుర్లు
విరగ పూసిన నవ్వులు
ఎర్ర ఎర్రని పువ్వులు
దశాబ్దాల నడకకు నజరానా లు
దూరపు కొండలు నునుపు
అందని ద్రాక్ష పులుపు
అంత్యప్రాసల వింతలు కావు
క్షణాన్ని వెంటేసుకుని భ్రమల్ని తోసేసుకొని
నిజం తలుపు తీసినప్పుడల్లా
నీలో ఆమె ఆమెలో నీవు
నీలో అతడు అతడిలో నీవు
ప్రేమ అంచుల్ని తాకే దాకా
రెండు కుటుంబాలు ఒక్క జీవనం
కాదేది బాధ్యత కనర్హం
వర్తమాన ప్రవర్ధనం
కంటి కలహారాలు విరిసినట్లు మురిసినట్లు
అట్లాంటిది ఏదో భావ జగత్తులో ఓ జంట
— కొండపల్లి నీహారిణి