స్వాగతమోయీకాళోజీ!

కాళోజీ జయంతి సందర్భంగా…..

 

ఇనుగుర్తి లోగిలిలోకి కాళోజీ రాక!
“స్వాగతమోయి! కాళోజీ! సుస్వాగతమంటూ!!”
ఆత్మీయంగా నాయనగారి ఆహ్వానం!
అమ్మేమో బాగున్నవా? అన్నట్టొక మాతృభావనాత్మక చూపు!
కవితా గానలోలులందరికీ కమ్మని తేనీటివిందు!
పసందుగ పద్మవిభూషణ..
బిరుదు పూలాభిషేకాలు…
ఆ బిరుదులన్నీ తమవిగ భావిస్తూ..
కాళోజీ అభిమానులు
నాగొడవంటూ… యాస బాసగోసలు!
వహ్వా..వహ్వాలతో…
మారుమోగే కరతాళ ధ్వనులు
తొలకరి వానజల్లుల వలె
ముషాయిరా ముచ్చట్లు!!
భావనాత్మక లోకంలో ..మా ఇంటి లోగిలి…
కలాలన్నీ హలాలుగ మారి ఉద్యమ ఊపిరిలూదే కవితలు ఝళిపించీ- కవిగారిని మురిపించీ…
కాళోజీ సిపాయిగ కవన యుద్ధమే చేసె!
బాధాతప్తుల హృదయావిష్కరణ ప్రభువులకెరుకజేసె!

అమ్మేమో ఆతని అంతరంగమెరగి కమ్మని భోజనమే వడ్డించగ!
“కమలమ్మ కరమే కరము”
కమ్మగ వంట చేయుటామె స్వంతమంటూ ”
మనస్పూర్తిగా కవితలో అభినందించీ..
కాళోజీ చేతికి నీళ్ళివ్వ చిన్నన్న తహతహలు!!
ఆప్యాయతతో అన్న భుజంతట్టి,
ఎక్కడి వాడో? తెలంగాణ నాదంటూ…అస్థిత్వ పోరాటం చేయాలంటూ…మేలూకొలిపె ప్రజలను…
మన బాస యాస సాధించిన కాళోజీ! నీ జ్ఞాపకాలను మరువమోయీ !

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్వీన్ ఎలిజబెత్ – ఓ ప్రచండ తేజం